నల్లగొండ : మత్తు పదార్థాల బారిన పడిన వారికి మెరుగైన చికిత్స అందించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శనివారం నల్లగొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో మత్తు విముక్తి విభాగాన్ని తనిఖీ చేసి మాట్లాడారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రోగులకు సూచించారు. రోగులకు అవసరమైన అన్ని సౌకర్యాలు, కౌన్సెలింగ్‌తో పాటు, చికిత్స అందిస్తూ శ్రద్ధగా చూసుకుంటున్నామని ఇన్‌చార్జి వైద్యుడు అనిల్ తెలిపారు. త్వరలోనే ప్రత్యేక డీ–అడిక్షన్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ రమేష్, డీఎంహెచ్‌ఓ పుట్ల శ్రీనివాస్, జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ సంపత్, డీఎస్పీ శివరాంరెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్ నరసింహారావు, ఇన్‌చార్జి డాక్టర్ జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.


