నల్లగొండ : మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయాలను భావితరాలకు తీసుకెళ్లాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శనివారం జ్యోతిరావుఫూలే ‘ద్వి శతాబ్ది’ ఉత్సవాల సందర్భంగా ఫూలే విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమానత్వం, సామాజిక న్యాయం, నాణ్యమైన విద్య కోసం కృషి చేసిన వ్యక్తి ఫూలే అని కొనియాడారు. నల్లగొండ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావుఫూలే సంఘసంస్కర్త మాత్రమే కాదని, మహిళా చదువు కోసం పోరాటం చేసిన వ్యక్తి అన్నారు. కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ అశోక్‌రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సంజీవ, తహసీల్దార్ పరశురాం, చోల్లేటి ప్రభాకర్, పున్న కై లాష్, మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్, మరగోని నవీన్‌గౌడ్, అడిషనల్ ఎస్పీ రమేష్, జెడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్‌రెడ్డి, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు, దుడుకు లక్ష్మీనారాయణ, పాలడుగు నాగార్జున, కొండూరు సత్యనారాయణ, నేలపట్ల సత్యనారాయణ, వెంకన్నగౌడ్, చొల్లేటి రమేష్, మిర్యాల యాదగిరి, పంకజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


