అటవీ భూముల్లో సాగు చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

అటవీ భూముల్లో సాగు చేయొద్దు

Apr 12 2026 2:48 AM | Updated on Apr 12 2026 2:48 AM

చందంపేట : అనుమతి లేకుండా అటవీ భూముల్లో సాగు చేయొద్దని ఎఫ్‌ఆర్‌ఓలు సుమన్‌, భాస్కర్‌ పేర్కొన్నారు. శనివారం మండలంలోని గువ్వలగుట్ట గ్రామంలో ప్రజలకు అటవీ భూముల సంరక్షణపై అటవీ శాఖ, పోలీసు శాఖ సంయుక్తంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఆర్‌ఓ సుమన్‌ మాట్లాడుతూ అక్రమంగా కలపను తరలించినా, చెట్లను నరికినా చట్టరీత్యా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. అటవీ జంతువుల సంరక్షణకు సహకరించాలని, అటవీ జంతువులను వేటాడినా, చంపినా శిక్షార్హులవుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐ బీసన్న, ఎస్‌ఐ లోకేష్‌, సర్పంచ్‌ సైదమ్మహన్మా, బీట్‌ ఫాసర్లు తదితరులు పాల్గొన్నారు.

సుందరీకరణ పనుల పరిశీలన

తిప్పర్తి : తిప్పర్తి మండల కేంద్రంలో చేపడుతున్న సుందరీకణ పనులను ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శ్రీధర్‌రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14న అంబేద్కర్‌ జయంతి సందర్భంగా అంబేద్కర్‌, బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహాల ఆవిష్కరణ, ఫౌంటేయిన్‌ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఏఈ గౌస్‌, ప్రసాద్‌, సిబ్బంది సైదులు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement