మిర్యాలగూడ అర్బన్ : విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక విద్యుత్ కార్యాలయం ఎదుట విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన సమ్మెకు ఆయన మద్దుతు తెలిపి మాట్లాడారు. కార్మికులందరికీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలని, అన్ని అర్హతలు కలిగి ఉండి అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులుగా పని చేస్తున్న వారిని ఆర్టిజన్లు గుర్తించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు డబ్బికార్ మల్లేష్, మల్లు గౌతంరెడ్డి, రవినాయక్, మంగారెడ్డి, సైదులు తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి


