నకిరేకల్ : నకిరేకల్ పట్టణంలోని మెయిన్ సెంటర్‌లో బస్‌షెల్టర్ లేక ప్రయాణికులు పాట్లు పడుతున్నారు. విజయవాడ, హైదరాబాద్, నల్లగొండ వెళ్లే ప్రయాణికుల కోసం పాత ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ ముందు చిన్న బస్‌షెల్టర్ ఉన్నా.. దాని చుట్టూ చిరు వ్యాపారుల బండ్లు పెట్టడంతో ఉపగయోగం లేకుండా పోయింది. పట్టణంలో ఈ కూడలికి బస్టాండ్ కిలోమిటర్ దూరంలో ఉన్నా.. ప్రయాణికులు మాత్రం బస్సుల కోసం ఇక్కడే నిరీక్షిస్తున్నారు. ఇక్కడ నీడ లేదు, కూర్చోవడానికి వసతులు లేవు. బస్సులు వచ్చేంత వరకు నిలబడాల్సిందే. ఈ సెంటర్‌లో బస్ షెల్టర్లు నిర్మిస్తే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందని పట్టణవాసులు అంటున్నారు.


