
వలంటీర్లు జాతీయస్థాయిలో రాణించాలి
నల్లగొండ టూటౌన్ : ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు జాతీయస్థాయిలో రాణించి మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఖ్యాతిని చాటాలని ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవి అన్నారు. వెస్ట్ జోన్ ప్రీ రిపబ్లిక్ పరేడ్ –2025 కోసం ఎంజీయూ పరిధిలోని ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్ల ఎంపిక గురువారం యూనివర్సిటీలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్ రీజినల్ యూత్ ఆఫీసర్ సైదానాయక్ వలంటీర్లకు రన్నింగ్ పరేడ్ పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనభర్చిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంపికై న వలంటీర్లను గుజరాత్‌లో జరిగే పీఆర్‌డీకి పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంజీయూ ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ పసుపుల మద్దిలేటి, స్టేట్ ఎన్‌ఎస్‌ఎస్ అధికారి నరసింహ, సుధాకర్, ఆనంద్, శ్రీనివాస్, కాంతయ్య, దయానంద్, శ్యామల, మేనేశ్వరి, పావని, శృతి తదితరులు పాల్గొన్నారు.