
అడ్డంకులు వచ్చినా ఆగేది లేదు..
చిట్యాల: వినాయకచవితికి హైదరాబాద్ నుంచి భారీ గణపతి విగ్రహాలను పెద్దఎత్తున వాహనాల్లో మండపాలకు తరలిస్తున్నారు. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాల పట్టణ శివారులోని రైల్వే అండర్‌పాస్ ఎత్తు తక్కువగా ఉండడంతో వాహనాల్లో భారీ విగ్రహాలను తరలించడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో అండర్‌పాస్ అవతలివైపే వాహనాల్లో నుంచి విగ్రహాలను క్రేన్ సహాయంతో కిందకు దించి చక్రాలతో ట్రాలీలో విగ్రహాలను ఉంచి తాళ్ల సహాయంతో అండర్‌పాస్ కింద నుంచి ఇవతలి వైపు లాక్కొస్తున్నారు. అనంతరం క్రేన్ సహాయంతో మరలా విగ్రహాన్ని వాహనాల్లోకి ఎక్కించి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో పలు విగ్రహాలు అండర్‌పాస్ బ్రిడ్జికి తగిలి ధ్వంసమవుతున్నాయి. అంతేకాకుండా విగ్రహాలను అండర్‌పాస్ కింద నుంచి తరలించే సమయంలో హైవేపై వచ్చే వాహనాలు ఆగిపోతుండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
క్రేన్‌తో విగ్రహాన్ని వాహనంలోకి ఎక్కిస్తున్న యువకులు
అండర్‌పాస్ నుంచి బయటకు వచ్చిన భారీ గణనాథుడు
అండర్‌పాస్ కింది నుంచి విగ్రహాన్ని లాగుతున్న యువకులు

అడ్డంకులు వచ్చినా ఆగేది లేదు..

అడ్డంకులు వచ్చినా ఆగేది లేదు..