వరిలో కొత్త రకం కలుపు మొక్కలు | - | Sakshi
Sakshi News home page

వరిలో కొత్త రకం కలుపు మొక్కలు

Aug 22 2025 6:30 AM | Updated on Aug 22 2025 6:30 AM

వరిలో

వరిలో కొత్త రకం కలుపు మొక్కలు

పొలం మొత్తం మళ్లీ దున్నిస్తున్నా

చిలుకూరు: ఈ ఏడాది వెదజల్లే పద్ధతిలో వరి సాగుచేసిన రైతులకు కలుపు మొక్కలు చుక్కలు చూపిస్తున్నాయి. గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు పొలాల్లో వివిధ రకాల కలుపు మొక్కలు విపరీతంగా పెరిగాయి. ఏ మందులు పిచికారీ చేసినా కలుపు మొక్కలు చనిపోయే పరిస్థితి లేదు. వరి విత్తనాలు వెదజల్లిన 15 నుంచి 20 రోజుల వ్యవధిలో రైతులు ఒకసారి కలుపు మందులు పిచికారీ చేశారు. అయినా కలుపు మొక్కలు చనిపోలేదు. మరోసారి పిచికారీ చేసినా ఎలాంటి ప్రయోజనం కనిపించలేదని రైతులు చెబుతున్నారు. గతంలో లేని విధంగా ఈసారి కొత్త రకం కలుపు మొక్కలు పుట్టుకొస్తున్నాయని రైతులు అంటున్నారు.

కొత్త రకం కలుపుతో తంటాలు

వెదజల్లే పద్ధతిలో సాగు చేసిన వరి పొలాలను ప్రారంభంలో ఆరబెట్టడం, నీళ్లు పెట్టడం చేయడం వలన సాధారణంగానే కలుపు మొక్కలు మొలకెత్తుతాయి. గతంలో తుంగ, వంజ, నక్కలతోకల గడ్డి, దారక లాంటి కలుపు మొక్కలు కనిపించగా.. మొదటి 20 రోజుల్లో మందులు పిచికారీ చేయడం వల్లన వాటిని నివారించేవారు. ఈ ఏడాది కొత్తగా నకిలి వరి, గోధుమ రంగులో వంజ, ఎర్ర, తెల్ల వంజలు మొలకెత్తాయని రైతులు వాపోతున్నారు. ఇవి ఏ మందులు కొట్టినా చనిపోవడం లేదని అంటున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వంజ రకం కలుపు విపరీతంగా పెరిగి అసలు వరి పైరు కనబడటం లేదని రైతులను ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత్యంతరం లేక చిలుకూరులో కొంతమంది రైతులు 30 నుంచి 35 రోజుల క్రితం వెదల్లే పద్ధతిలో సాగు చేసిన పొలాలను ట్రాక్టర్‌తో దున్ని మళ్లీ నాట్లు వేస్తున్నారు. దీని వల్లన రైతులు ఒక్కో ఎకరానికి రూ. 20వేలకు పైగా నష్ట్రపోతున్నారు. చిలుకూరు నుండి దూదియాతండా రోడ్డులో చాలా మంది రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. చిలుకూరు మండల వ్యాప్తంగా 70 శాతం మంది రైతులు ఈ ఏడాడి వెదజల్లే పద్ధతిలోనే వరి సాగు చేశారు. ఇప్పటికై నా వ్యవసాయాధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పొలాలను పరిశీలించి సూచనలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. నష్టపోయిన రైతులను గుర్తించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ఈ వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేశాను. గతంలో మాదిరిగానే ఈసారి కూడా మొదటి 20 రోజులకు కలుపు మందులు పిచికారీ చేశా. అయినా అవి చనిపోలేదు. మళ్లీ వెంటనే రెండోసారి కూడా కలుపు మందులు పిచికారీ చేసినా ఫలితం లేదు. పొలంలో విపరీతంగా కొత్త రకం వంజ పుట్టింది. పొలం మొత్తం కమ్మేసింది. ఏమి చేయాలో అర్ధంకాక పొలం మొత్తం మళ్లీ దమ్ము చేసి నాట్లు వేస్తున్నా.

– గుండు శ్రీను, కౌలు రైతు, చిలుకూరు

ఫ పొలం చెడగొట్టి మళ్లీ దమ్ము చేస్తున్న

రైతులు

ఫ వ్యవసాయాధికారులు సూచనలు

ఇవ్వాలని కోరుతున్న అన్నదాతలు

వరిలో కొత్త రకం కలుపు మొక్కలు1
1/2

వరిలో కొత్త రకం కలుపు మొక్కలు

వరిలో కొత్త రకం కలుపు మొక్కలు2
2/2

వరిలో కొత్త రకం కలుపు మొక్కలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement