
మిర్యాలగూడలో రామ్‌రాజ్ కాటన్ షోరూం ప్రారంభం
మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణంలోని సాగర్ రోడ్డులో రామ్‌రాజ్ కాటన్ షోరూమ్‌ను గురువారం స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తన సతీమణి మాధవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రామ్‌రాజ్ కాటన్ దుస్తులను దేశంలోని రాజకీయ నాయకులతో పాటు ప్రముఖ వ్యక్తులు ఎక్కువగా ఆదరిస్తున్నారని అన్నారు. దేశంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో తెల్లటి దుస్తుల అమ్మకాల్లో రామ్‌రాజ్ కాటన్ పేరుగాంచిందన్నారు. కంపెనీ ప్రతినిధులు సరసమైన ధరలకు దుస్తులు అందించేలా కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో బిల్డింగ్ ఓనర్ రాము, రామ్‌రాజ్ కాటన్ షోరూం ఫౌండర్, ఛైర్మన్ కేఆర్. నాగరాజన్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ చిలుకూరి రమాదేవిశ్యామ్ తదితరులు పాల్గొన్నారు.