
దళారులతో మంత్రులు కుమ్మక్కు
నల్లగొండ టూటౌన్ : యూరియా కొరత వెనుక కొందరు మంత్రులు, అధికారులు దళారులతో కుమ్మక్కయ్యారని మాజీమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల రోజులుగా యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు నిద్రాహారాలు మాని, యూరియా కోసం చెప్పులు లైన్‌లో పెట్టుకునే పరిస్థితి తెచ్చిందన్నారు. గతంలో నల్లగొండ మంత్రి ధాన్యం కొనుగోళ్లలోనూ కమీషన్లు తీసుకుని రైతులను గాలికి వదిలేశారని ఆరోపించారు. 56 సార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి కనీసం ఎరువులు తేలేడా అని ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లి కాళ్లు పట్టుకొని పదవులు తెచ్చుకొనే కాంగ్రెస్ నేతలకు రైతుల సమస్యలపై పట్టింపులేదన్నారు. నల్లగొండ నియోజకవర్గంలో మంత్రి పూర్తిగా విఫలమయ్యారని, ధాన్యం కొనుగోళ్లు అంతే, నీళ్ల పరిస్థితి అంతే, ఇవ్వాల యూరియా కొరతపైనా అదే పరిస్థితి ఉందన్నారు. ఇద్దరు మంత్రులు దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకునే రీతిలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నల్లగొండ నియోజకవర్గంలో సాగునీటి కోసం రైతులు రోడ్డు ఎక్కుతున్నారని.. ఈ విషయంలో మంత్రులు సిగ్గు పడాలన్నారు. ప్రతి ఎకరాకు కావాల్సిన యూరియా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఎరువుల విషయంలో ప్రభుత్వానికి ముందస్తు సమీక్ష లేదని, ప్రైవేట్ దళారులతో కుమ్మకై ్క అన్నదాతను అరిగోస పెట్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా కొరత లేదని జిల్లా అధికారులు అబద్ధాలు చెబితే మీరే ఇబ్బందులు పడుతారని హెచ్చరించారు. కొరత లేదని చెప్పే అధికారులు రైతులకు ఎందుకు యూరియా ఎందుకు ఇవ్వడం లేదన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిషోర్‌కుమార్, నిరంజన్‌వలి, కటికం సత్తయ్యగౌడ్, మందడి సైదిరెడ్డి, చీర పంకజ్‌యాదవ్, సింగం రామ్మోహన్, అభిమన్యు శ్రీనివాస్, మాలె శరణ్యారెడ్డి, బోనగిరి దేవేందర్, జమాల్‌ఖాద్రీ, మారగోని గణేష్, పల్‌రెడ్డి రవీందర్‌రెడ్డి, నాగార్జున పాల్గొన్నారు.
ఫ యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలం
ఫ సంపాదన పైనే సీఎం, మంత్రుల దృష్టి
ఫ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి విమర్శ