Telangana Crime News: రెండు బైక్‌లు ఢీ.. ఒకరు దుర్మరణం
Sakshi News home page

రెండు బైక్‌లు ఢీ.. ఒకరు దుర్మరణం

Jan 17 2024 2:02 AM | Updated on Jan 17 2024 12:05 PM

- - Sakshi

మహేష్‌ (ఫైల్‌)

ఆలేరురూరల్‌: రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన ఆలేరు మండలంలోని గొలనుకొండ సమీపంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు గ్రామానికి చెందిన సీసా మహేష్‌(35) సోమవారం సంక్రాంతి పండుగకు బైక్‌పై ఆలేరు మండలంలోని గొలనుకొండలో గల తన అత్తగారింటికి వచ్చాడు.

అదే రోజు మధ్యాహ్నం పెద్దకందుకూరుకు తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో గొలనుకొండ సమీపంలోని కుమ్మరికుంట వద్దకు చేరుకోగానే జనగామ జిల్లా లింగాల ఘనపూర్‌ మండలం కుందారం గ్రామానికి చెందిన ఎల్లల నరేష్‌ పల్సర్‌ బైక్‌పై అమ్మనబోలు నుంచి వస్తూ మహేష్‌ బైక్‌ను ఎదురుగా ఢీకొట్టాడు.

ఈ ప్రమాదంలో మహేష్‌ రోడ్డుపై పడిపోగా తల పగిలి అక్కడిక్కడే మృతిచెందా డు. నరేష్‌కు తీవ్ర గాయాలు కాగా హై దరాబాద్‌లోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. మృతుడు మహేష్‌కు భార్య, ముగ్గురు పిల్లలు పల్లిలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ జి. వెంకటశ్రీను తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement