గీతన్నలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి | - | Sakshi
Sakshi News home page

గీతన్నలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

Aug 7 2026 2:08 AM | Updated on Aug 7 2026 2:08 AM

నకిరేకల్‌ : కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు, గీతన్నల చైతన్య బస్సుయాత్ర రథసారథులు ఎంవీ.రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. గీత కార్మికులల ఉపాధి, సంక్షేమం.. వృత్తి ఆధునికీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ అమరుల యాదిలో పేరుతో చేపట్టిన గీతన్నల చైతన్య బస్సుయాత్ర గురువారం నకిరేకల్‌కు చేరుకుంది. ఆ సందర్భంగా స్థానిక మెయిన్‌ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. గీత కార్మికులకు నెలకు రూ.4 వేల పెన్షన్‌ ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న గీత కార్మికుల ఎక్స్‌గ్రేషియా రూ.20 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి

ఈ యాత్రకు నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సంఘీభావం తెలిపి మాట్లాడారు. ప్రభుత్వం గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్యాయం చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు చౌగోని సీతారాములు, జిల్లా సహాయ కార్యదర్శి రాచకొండ వెంకట్‌గౌడ్‌, మండల అధ్యక్ష, కార్యదర్శులు పోటిచేటి వీరయ్య, గుడుగుంట్ల బుచ్చిరాములు, ఆ సంఘం నాయకులు ఎరుకలి అంజయ్య, దోరేపల్లి ఎల్లయ్య, అంతగి వెంకటయ్య, గుండగోని జంగయ్య, వెంకట్‌, నర్సింగ్‌ జానయ్య, పోలగాని వెంకన్న, తండు సుధాకర్‌, అంతటి రాములు తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండకు చేరిన చైతన్య యాత్ర

నల్లగొండ టౌన్‌ : గీతన్నల చైతన్య బస్సుయాత్ర గురువారం సాయంత్రం నకిరేకల్‌ నుంచి నల్లగొండ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఆ సందర్భంగా ఆ సంఘం నాయకులు గడియారం సెంటర్‌లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఫ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రమణ, వెంకటేశ్వర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement