శుక్రవారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : దివ్యాంగ పెన్షన్లలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా వినికిడి వైకల్యం పేరుతో నకిలీ లేదా తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి పెన్షన్లు పొందుతున్నారనే అనుమానాల నేపథ్యంలో ప్రత్యేక సోషల్ ఆడిట్‌కు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో హైరిస్క్‌గా గుర్తించిన లబ్ధిదారులపై వైద్యపరమైన పునఃపరిశీలన నిర్వహించి, నిజమైన అర్హులకే పెన్షన్లు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
50 మందికి మళ్లీ పరీక్షలు
ఈ ప్రత్యేక పరిశీలనలో భాగంగా నల్లగొండ జిల్లాలో వినికిడి లోపం ఆధారంగా దివ్యాంగ పెన్షన్ పొందుతున్న 50 మంది హైరిస్క్ లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారి వైకల్య ధ్రువీకరణ పత్రాలు, వైద్య నివేదికలు, పెన్షన్ అర్హతలను మరోసారి పరిశీలించనున్నారు. అర్హతలేని వారు వికలాంగు పెన్షన్ పొందకుండా చర్యలు తీసుకోనున్నారు.
బెరా పరీక్షే తుది ఆధారం
రీవెరిఫికేషన్‌లో భాగంగా నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన బ్రేయిన్‌స్టెమ్ ఎవోక్డ్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ (బెరా) పరికరంతో వినికిడి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష నివేదిక ఆధారంగానే వినికిడి వైకల్యం శాతాన్ని నిర్ధారించి, దివ్యాంగ పెన్షన్‌కు అర్హత ఉందా లేదా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. నల్లగొండతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లాల లబ్ధిదారులకు కూడా ఇదే కేంద్రంలో పరీక్షలు నిర్వహించనున్నారు.
31లోగా ప్రక్రియ పూర్తి
జిల్లాలో ఎంపిక చేసిన 50 మంది లబ్ధిదారుల రీవెరిఫికేషన్ ప్రక్రియను ఈనెల 31వ తేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. పునఃపరీక్షలు పూర్తయిన అనంతరం సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. తద్వారా అక్రమాలను అడ్డుకుని సంక్షేమ ఫలాలను అర్హులకు అందించడమే లక్ష్యంగా ఈ సోషల్ ఆడిట్ చేపట్టారు.
ఫ దివ్యాంగ పెన్షన్లలో అక్రమాలను అరికట్టేలా ప్రభుత్వం నిర్ణయం
ఫ 50 మంది లబ్ధిదారులపై సోషల్ ఆడిట్ ఫ ఈ నెలాఖరులోగా రీవెరిఫికేషన్ పూర్తికి ఆదేశాలు


