జీవితంపై విరక్తితో వ్యక్తి బలవన్మరణం | Sakshi
Sakshi News home page

జీవితంపై విరక్తితో వ్యక్తి బలవన్మరణం

Published Tue, Jan 9 2024 5:50 AM

- - Sakshi

రామన్నపేట: జీవితంపై విరక్తితో రైలు కింద పడి వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం రామన్నపేట శివారులో వెలుగులోకి వచ్చింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నపేటకు చెందిన బొడ్డు శ్రీరాములు(52) మేసీ్త్ర పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆదివారం సాయంత్రం మద్యం తాగి వచ్చిన శ్రీరాములును కుటుంబ సభ్యులు మందలించారు.

దీంతో శ్రీరాములు ఇంటి నుంచి బయటకు వెళ్లి రాత్రి వరకు తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం రామన్నపేట–వలిగొండ రైల్వేస్టేషన్ల మధ్య కీ మ్యాన్‌ ట్రాక్‌ చెక్‌ చేస్తుండగా 48/8–9పోల్‌ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పడి ఉండడం గమనించి రైల్వే అధికారులకు సమాచారం అందించాడు.

సమాచారం తెలుసుకున్న స్థానికులు అక్కడకు చేరుకుని శ్రీరాములు మృతదేహంగా గుర్తించారు. జీవితంపై విరక్తితో గుర్తుతెలియని రైలుకింద పడి శ్రీరాములు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. రైల్వే అధి కారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్‌ఐ కె. సాలకమ్మ తెలిపారు.

ముఖ్య గమని​క:
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement