వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయంలో సోమవారం భక్తుల కోలాహలం నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా రామప్ప ఆలయానికి తరలివచ్చి రామలింగేశ్వర స్వామికి అభిషేకం, అర్చన పూజలు నిర్వహించారు. దీపావళి పండుగ నేపథ్యంలో భక్తులు, పర్యాటకులు రామప్ప ఆలయానికి అధిక సంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వర స్వామిని దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించారు. అలాగే ఇంగ్లడ్ దేశానికి చెందిన సోపీ దేవాలయాన్ని సందర్శించి శిల్పాలను ఆసక్తిగా తిలకించారు. గైడ్ విజయ్‌కుమార్ శిల్పాల విశిష్టత వివరించగా శిల్పకళ సంపద ఆకట్టుకునేలా ఉందని కొనియాడారు.


