● మున్సిపల్ చైర్పర్సన్ చంద్రకళ
ములుగు: ఇందిరమ్మ ఇళ్ల పథకంతో నిరుపేదల సొంతింటి కలను రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేస్తుందని మున్సిపల్ చైర్పర్సన్ చంద్రకళ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ చంద్రకళ, గ్రంథాలయ చైర్మన్ రవిచందర్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతీ పేద కుటుంబానికి సొంతింటి కలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్న సీఎంరేవంత్రెడ్డి, మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. సొంతింటిలో దీపావళి పండుగ జరుపుకోవడంపై లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ ఆసియా షాహిన్ రియాజ్ మీర్జా, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


