ఏటూరునాగారం: మండల కేంద్రంలోని శ్రీఉమారామలింగేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ఆకాశ దీపోత్సవం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ చైర్మన్ మడుగూరి ప్రసాద్, అర్చకులు రాజ్‌కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభానికి ఆకాశ దీపాన్ని వెలిగించారు. అలాగే రామాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ధన్నపునేని రాజేశ్వర్‌రావు(కిరణ్), ఆలయ అర్చకులు యల్లాప్రగడ నాగేశ్వర్‌రావుశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆకాశ దీపోత్సవాన్ని నిర్వహించారు. ధ్వజస్తంభానికి తాడుతో దీపాన్ని కట్టి వెలగించి పైకి పంపించారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆకాశ దీపాన్ని భక్తులు దర్శించుకున్నారు. దీపకాంతులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
శివాలయం, రామాలయానికి
తరలివచ్చిన భక్తులు


