బైక్‌తో ఇసుక క్రేన్‌.. | - | Sakshi
Sakshi News home page

బైక్‌తో ఇసుక క్రేన్‌..

Nov 11 2026 12:55 AM | Updated on Nov 11 2026 12:55 AM

● సులభంగా రెండు అంతస్తులపైకి

ఇసుక తరలింపు

● వినూత్న యంత్రాన్ని రూపొందించిన వ్యక్తి..

ఏటూరునాగారం: అతని చదువు డిగ్రీ డిస్‌ కంటిన్యూ.. ప్రస్తుతం టాటా ఏస్‌ గూడ్స్‌ వాహనం యజమాని కమ్‌ డ్రైవర్‌. కానీ, తన ఆలోచన శక్తితో ద్విచక్రవాహనంతో ఇసుకను భవనంపైకి పంపించే యంత్రాన్ని తయారు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రానికి చెందిన రాంటెంకి చంద్రశేఖర్‌ ప్రతి రోజూ తన గూడ్స్‌ వాహనంలో సిమెంట్‌ బస్తాలు, ఇతరత్ర సామగ్రిని రవాణా చేస్తుంటాడు. తను భవనాల వద్ద ఇసుక రవాణా చేసే సమయంలో కూలీలు ఇసుక బస్తాలను పైకి మోస్తూ తీసుకెళ్లడాన్ని గమనించాడు. పెద్ద పెద్ద క్రేన్లు పెట్టే ఆర్థిక స్థోమత లేనివాళ్లకు కూలీలతో మోయించడంతో డబ్బులతో పాటు సమయం కూడా వృథా అవుతుందని, దీనిని అధిగమించాలన్న ఆలోచన వచ్చింది. ఇసుకను భవనం పైకి పంపించడం యంత్రం తయారు చేస్తే దాని ద్వారా వచ్చే ఆదాయం కూడా కుటుంబ అభివృద్దికి దోహద పడుతుందని ఆలోచన చేశాడు. పాడైపోయిన బైక్‌ను తీసుకొని దానికి ఉన్న చక్రాలను ఊడదీసి ఇనుప చక్రాన్ని తయారు చేసి టైర్‌ స్థానంలో దానిని అమర్చాడు. తాడును చక్రానికి అమర్చి బకెట్‌ను తాడుకు కట్టి బైక్‌కు ఉన్న ఎక్స్‌లేటర్‌ను రేజ్‌ చేస్తూ ఉంటే ఆ తాడు సాయంతో బకెట్‌లోని ఇసుక పై అంతస్తుకు సులభంగా వెళ్తోంది. ఇలా ఇసుకనే కాదు, కంకర, ఇతర సామగ్రికి సులభంగా తరలించేలా యంత్రాన్ని స్వయంగా తయారు చేసి అందరిని అబ్బుర పర్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement