హన్మకొండ కల్చరల్: కార్తీకమాసం ప్రారంభం సందర్భంగా నేటి(మంగళవారం)నుంచి ప్రతీరోజూ శ్రీభద్రకాళి దేవాలయంలో కార్తీకదీపోత్సవం నిర్వహిస్తున్నట్లు ఈఓ రామల సునీత తెలిపారు. ఈ మాసంలో రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, రుద్రహోమాలుంటాయని పేర్కొన్నారు. శ్రీభద్రకాళి దేవాలయాన్ని సోమవారం మణిపూర్ రాష్ట్రం నోని జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీధర్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. పూజల అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు.
కేయూ మహిళా
చెస్ జట్టు ఎంపిక
కేయూ క్యాంపస్: హైదరాబాద్‌లోని ఉమెన్స్ యూనివర్సిటీలో ఈనెల 9నుంచి ప్రారంభమై 12వ తేదీవరకు జరగనున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ చెస్‌టోర్నమెంట్‌లో పాల్గొననున్న కాకతీయ యూనివర్సిటీ మహిళా జట్టును ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ డాక్టర్ టి.శాస్త్రి సోమవారం తెలిపారు. చిలకబత్తిని నవ్య, పూజశ్రీపుప్పాల, మాధురి కర్జ్, బచ్చలి నవ్య, కోరం పూజిత, కుర్సమ్ సాహిత్య, ఉన్నారు. జట్టుకు టీజీటీ డబ్ల్యూఆర్‌డీసీ(ఖమ్మం) ఫిజికల్ డైరెక్టర్ బి రమ్య కోచ్‌కమ్ మేనేజర్‌గా జట్టులో వ్యవహరిస్తోందని శాస్త్రి తెలిపారు.
నిర్మాణరంగంలో
ఉద్యోగ అవకాశాలు
భూపాలపల్లి అర్బన్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నిర్మాణరంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి చెందిన తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) ద్వారా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మల్లయ్య సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అభ్యర్థుల వయస్సు 22నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలన్నారు. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం తప్పనిసరి అని చెప్పారు. ఎంపికై న వారికి ఉచిత విమాన టికెట్, ఉచిత వీసా, ఉచిత వసతి, రోజుకు మూడు పూటల భోజనం, ఉచిత రవాణా సౌకర్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. టామ్‌కామ్ మిస్డ్ కాల్ నంబర్ 08035524946కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా లేదా వెబ్‌సైట్‌లోని క్యూఆర్‌కోడ్‌ను స్కాన్ చేసి తమ వివరాలను నమోదు చేసుకోవచ్చన్నారు. టామ్‌కామ్ కార్యాలయ ఫోన్ నంబర్ 040–23342040, టామ్‌కామ్ వెబ్‌సైట్, జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
28వ రోజుకు చేరిన సమ్మె
భూపాలపల్లి అర్బన్: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులు చేపడుతున్న నిరవధిక సమ్మె సోమవారానికి 28వ రోజుకు చేరుకుంది. కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్షలను కొనసాగిస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ఉద్యోగులు స్పష్టం చేశారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు. ఉద్యోగ భద్రతతో పాటు న్యాయమైన సర్వీస్ ప్రయోజనాలు కల్పించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం జేఏసీ జిల్లా అధ్యక్షుడు బడితల రమేశ్, ప్రధాన కార్యదర్శి మధు, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేశ్, ఉపాధ్యక్షుడు డాక్టర్ రఘురాం, సలహాదారులు శ్రీనివాస్, ప్రభాకర్, జిల్లా కోఆర్డినేటర్ ప్రవీణ్, డాక్టర్ జగదీశ్, మీడియా ఇన్‌చార్జ్ రాజు, రామ్మూర్తి, వైద్యులు, ఏఎన్‌ఎంలు, స్టాఫ్ నర్సులు, ఫార్మసీ అధికారులు, కాంటింజెంట్ వర్కర్లు పాల్గొన్నారు.


