గణపురం: మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు నాగరాజు ఆధ్వర్యంలో స్వామి వారికి పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం గణపేశ్వర స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు ఉదయం నుంచే అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఇదిలా ఉండగా.. జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కోడూరి నవీన్‌కుమార్‌సుమతి దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ గోశాలలో పని చేస్తున్న పాణిగంటి గణేష్‌కు రూ.24 వేలు వేతనాన్ని నవీన్‌కుమార్ దంపతులు అందించారు.
కార్మిక సంఘాల
నాయకులను నిలదీయాలి
భూపాలపల్లి రూరల్: కార్మికులను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ.. ఇచ్చిన హామీలను నేరవేర్చని కార్మిక సంఘాల నాయకులను గనుల పైన కార్మికులు నిలదీయాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య పిలుపునిచ్చారు. యూనియన్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గట్టయ్య మాట్లాడారు. ఈ నెలతో సింగరేణి ఎన్నికల గడువు ముగుస్తుందని, గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ ప్రాతినిధ్య కార్మిక సంఘం ఐఎన్‌టీయూసీ కార్మికులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. గెలిచిన కార్మిక సంఘాలు కార్మిక సమస్యలను గాలికి వదిలేసి తమ ఆర్థిక ప్రయోజనాల కోసమే పైరవీకారులుగా మారి కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి సింగరేణిలో కార్మిక ఓట్లు దండుకోవడానికి ముందుకొస్తున్న ఈ సంఘాల నాయకులను హమీలపై ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం సింగరేణి వ్యాప్తంగా పోరాటాలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో యూనియన్ నాయకులు దాసరి జనార్ధన్, రాళ్ల బండి బాపు, రత్నం కిరణ్, నామల శ్రీనివాస్, సలీం సాజిత్ తదితరులు పాల్గొన్నారు.


