వదలరు.. కదలరు! | - | Sakshi
Sakshi News home page

వదలరు.. కదలరు!

Aug 12 2026 3:04 AM | Updated on Aug 12 2026 3:04 AM

వదలరు.. కదలరు!

అధికారులు ఆదేశాలు

జారీ చేసినా ఇక్కడే..

కేఎంసీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ‘ఔట్‌సోర్సింగ్‌’ హ వా

కాశిబుగ్గ: వరంగల్‌ కాకతీయ వైద్య కళాశాల ఆవరణలోని ప్రభుత్వ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌లో వైద్యసేవల తీరుపై విమర్శలు వస్తున్నాయి. అవసరం ఉన్న చోట విధులు నిర్వర్తించాల్సిన ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఇష్టానుసారంగా పనిచేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. వాస్తవానికి వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రి పరిఽధిలో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌లో పనిచేయాల్సి ఉంది. వైద్యసిబ్బంది సైతం ఎక్కడ వైద్యసేవలు అవసరం ఉంటే అక్కడికి వెళ్లక తప్పదు. అయితే, సూపర్‌ స్పెషాలిటీలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది తీరే వేరుగా ఉంది. చివరకు వారు అధికారుల ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.

ఎంజీఎంకు అనుబంధంగా హాస్పిటల్‌..

వరంగల్‌ ఎంజీఎంకు అనుబంధంగా పీఎంఎస్‌ఎస్‌వై పఽథకం కింద సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ను వరంగల్‌ కాకతీయ వైద్యకళాశాల ఆవరణలో ఏర్పాటు చేశారు. ఎంజీఎంలో అందిస్తున్న వైద్యసేవలతోపాటు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రత్యేకంగా సూపర్‌ సేవలు అందిస్తోంది. ఇందులో పనిచేసే ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది కూడా ఈ రెండు హాస్పిటల్స్‌లో అధికారుల ఆదేశాల ప్రకారం విధులు నిర్వర్తించాల్సి ఉంది. సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌లో పనిచేస్తున్న సిబ్బంది తీరు వేరే అన్నట్లు తాము ఇక్కడే పనిచేస్తామంటూ కొందరు సిబ్బంది పట్టుబడుతున్నట్లు సమాచారం.

వైద్యసిబ్బంది తీరు ఇలా..

సూపర్‌ స్పెషాలిటీలో ఎక్కువ మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది పనిచేస్తున్నారు. చివరకు ఎక్కువ మంది వైద్యులు కూడా కాంట్రాక్టు పద్ధతిపై విధులు నిర్వర్తిస్తున్నారు. 120 మంది స్టాఫ్‌నర్సులు ఉండగా.. ఇటీవల 20 మంది వరకు ఉద్యోగాలు వచ్చి రాజీనామా చేసి వెళ్లారు. ఐదారుగురు మూడు నెలల నుంచి రాకుండా ఉంటున్నట్లు తెలుస్తోంది. కొందరూ మెడికల్‌ లీవ్‌లో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం 90 మంది వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. పారామెడికల్‌ సిబ్బంది 98 వరకు ఉండగా, వీరిలో ఆరుగురు రాజీనామా చేసి వెళ్లారు. కొందరు రెండు నెలల నుంచి లాంగ్‌ లీవ్‌లో ఉంటూ ఏమి చేస్తున్నారో తెలియదు. ఇక 115 మంది వరకు పేషంట్‌ కేర్‌, శానిటేషన్‌, సెక్యూరిటీ గార్డులు పనిచేస్తున్నారు. వీరిలో కొంతమంది విధులకు సరిగా హాజరు కావడం లేదని సమాచారం.

ఆస్పత్రిలో ఇష్టానుసారంగా విధులు నిర్వర్తిస్తున్నారని ఆరోపణలు

ఎంజీఎంలో అవసరం ఉన్నా

వెళ్లనంటున్న మిగులు సిబ్బంది

అధికారుల ఆదేశాలను

పట్టించుకోని తీరు

సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నుంచి ఎంజీఎంకు వెళ్లాలంటూ అఽధికారులు లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేసినా కొందరు సిబ్బంది మేము వెళ్లమంటూ చెబుతూ సూపర్‌లోనే పనులు చేస్తున్నట్లు సమాచారం. వీరిలో స్టాఫ్‌నర్సులు, పేషంట్‌ కేర్‌, శానిటేషన్‌, సెక్యూరిటీ గార్డులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడే పనిచేస్తామని పట్టుబట్టడానికి కారణమేమిటో అంతుపట్టడం లేదని అధికారులే తలపట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఇంకా కొంతమంది సిబ్బంది ఇష్టానుసారంగా విధులకు వచ్చి వెళ్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వీరిని గాడిలో పెట్టాల్సిన సూపర్‌వైజర్లు ఏం చేస్తున్నారో వారికే తెలియాలి. కొన్ని సందర్భాల్లో కచ్చితంగా పనిచేయాలని చెబితే వారికి ఉద్యోగ అవకాశం కల్పించిన ప్రజాప్రతినిధి నుంచి టక్కున ఫోన్‌కాల్‌ వస్తుంది. దీంతో అధికారులు ఏమి చేయలేని పరిస్థితి ఉంది. ఇదంతా బహిరంగమే అయినా ‘ఎవరికీ వారే యమునా తీరే’ అన్నట్లు ఉందనే ప్రచారం లేకపోలేదు. ఇటీవల ముగ్గురు సెక్యూరిటీ గార్డులపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఎంజీఎంకు పంపించినట్లు తెలుస్తోంది.

పేషెంట్లు తక్కువ.. వైద్యసిబ్బంది ఎక్కువ

ప్రతిరోజు ఓపి ఉన్నప్పుడు 400 నుంచి 500 వరకు పేషెంట్లు వస్తుంటారు. ఇక ఇన్‌పేషెంట్ల పరంగా 20 నుంచి 25 వరకు మాత్రమే ఉంటారని సమాచారం. దీనిని బట్టి చూస్తే పేషెంట్లు తక్కువగా ఉన్నా వైద్య సిబ్బంది అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అధికారులు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement