ములుగు రూరల్: విద్యార్థులు లక్ష్యంతో చదువుతూ ముందుకు సాగాలని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కొప్పుల మల్లేశం అన్నారు. ఈ మేరకు మంగళవారం బండారుపల్లి పీఎంశ్రీ మోడల్ పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు సమయం వృథా చేయకుండా ప్రణాళికతో చదవాలన్నారు. ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థి దశ నుంచే సేవాగుణాన్ని అలవర్చుకోవాలని సూచించారు. శ్రద్ధతో చదివి ఉన్నతస్థాయికి చేరుకుని ఉపాధ్యాయులకు, తల్లి దండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం వందన, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మల్లేశం


