కుర్చీతాత బూతు పురాణం.. పోలీసులకు ఫిర్యాదు! | Youtuber Swathi Naidu, Vizag Satya Complaints Against Kurchi Thatha | Sakshi
Sakshi News home page

Kurchi Thatha: ఆ ఇద్దరిపై కుర్చీతాత బూతు పురాణం.. పోలీసులకు ఫిర్యాదు!

Mar 6 2024 11:18 AM | Updated on Mar 6 2024 11:37 AM

Youtuber Swathi Naidu, Vizag Satya Complaints Against Kurchi Thatha - Sakshi

వెంగళరావునగర్‌(హైదరాబాద్‌): బూతు పురాణాలతో మరోసారి కుర్చీతాత రచ్చకెక్కాడు. గతంలో అనేకమార్లు ప్రముఖ యూట్యూబ్‌ స్టార్స్‌ స్వాతినాయుడు, వైజాగ్‌ సత్యపై దుర్భాషలాడి పలు కేసుల్లో ఇరుక్కున్నాడు. చివరకు క్షమాపణలు కోరుతూ కేసులు లేకుండా చేసుకున్నాడు. అయితే మళ్లీ అదే తరహాలో బూతులు మాట్లాడుతున్నాడని బాధితులు మంగళవారం మధురానగర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు, బాధితులు తెలియజేసిన వివరాలు.. రహమత్‌నగర్‌కు చెందిన కాలా పాషా అలియాజ్‌ కుర్చీ తాత మహేశ్‌బాబు సినిమాలోని కుర్చీ పాట ద్వారా యూ ట్యూబ్‌లో ఫేమస్‌ అయ్యాడు.

అయితే, యూ ట్యూబ్‌లో షార్ట్‌ ఫిల్మ్‌ తీసే స్వాతినాయుడు, వైజాగ్‌ సత్యతో గతంలో సన్నిహితంగా ఉండేవాడు. అతని చెడు ప్రవర్తన కారణంగా వారు అతనిని దూరంగా ఉంచారు. దాంతో గతంలో వారిని తీవ్ర అసభ్య పదజాలంతో దుర్భాషలాడటంతో బాధితులు జూబ్లీహిల్స్, తర్వాత మధురానగర్‌ పీఎస్‌లో కేసులు పెట్టారు. అనంతరం కుర్చీతాత వారితో రాజీ కుదుర్చుకున్నాడు. తాజాగా మళ్లీ తమను తిడుతున్నాడంటూ స్వాతినాయుడు, వైజాగ్‌ సత్యలు మంగళవారం మధురానగర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా, రెండు రాష్ట్రాలకు చెందిన ప్రస్తుత, మాజీ సీఎంలను, సినీరంగ ప్రముఖులను సైతం తిడుతున్నాడని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement