Kurchi Thatha
-
‘కుర్చీతాత’ కాలా బాషా కన్నుమూత
శ్రీనగర్ కాలనీ (హైదరాబాద్): ప్రపంచవ్యాప్తంగా వైరలైన.. హీరో మహేష్‌బాబు సినిమా ‘గుంటూరు కారం’లోని ‘ఆ కుర్చీని మడతపెట్టి’పాటకు పరోక్షంగా కారణమైన కుర్చీ తాత అలియాస్ మహ్మద్ కాలా బాషా (66) బుధవారం మృతి చెందాడు. దీంతో సోషల్ మీడియా పలువురు నివాళులర్పిస్తున్నారు.ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో తమ కుటుంబ సభ్యుల మధ్య జరిగిన సంభాషణను వివరిస్తూ కుర్చీని మడత పెట్టి అనే పదం వాడాడు కాలా బాషా. అది అలా సోషల్ మీడియాలో విపరీతంగా వెళ్లింది. అనంతరం ‘గుంటూరు కారం’సినిమాలో ఆ పదంతో పాట వచ్చి సంచలనం సృష్టించింది. విదేశీయులు సైతం ఈ పాటకు స్టెప్స్ వేసేవరకు వెళ్లింది. బోరబండ పరిసర ప్రాంతంలో నివాసం ఉంటూ.. రోజూ యూసుఫ్‌గూడ, కృష్ణకాంత్‌పార్క్ పరిసరాల్లో తిరుగుతుండేవాడు. బస్సులు ఎక్కి ఇంగ్లీష్‌లో డబ్బులు అడుక్కునేవాడు. అలా ఓ ఇంటర్వ్యూలో కుర్చీని మడతబెట్టి ... డైలాగ్‌తో కాలా బాషా కుర్చీతాతగా ప్రాచుర్యం పొందాడు. సోషల్ మీడియాలో మీమ్‌గా వైరల్ కావడంతో పలువురు ఇంటర్వ్యూలు చేసేవారు. అలా సోషల్ మీడియా సెలబ్రిటీ అయిపోయాడు. బాషాకు మద్యం అలవాటు ఉంది. పలుసార్లు అనారోగ్యానికి గురయ్యాడు. ఇంతకు ముందు కూడా కాలా బాషా చనిపోయినట్లు ప్రచారం జరిగింది. అయితే వైజాగ్ సత్యలాంటి వాళ్లు అది ఫేక్ న్యూస్ అని తేల్చేశారు. ఎండ తీవ్రత తట్టుకోలేక బుధవారం సాయంత్రం కృష్టకాంత్ పార్క్ వద్ద స్పృ హ తప్పి పడిపోయాడు. అక్కడివారు గమనించి కుటుంబసభ్యులకు తెలియజేయగా ఇంటికి తీసుకెళ్లాక మృతి చెందాడు. -
కుర్చీతాత బూతు పురాణం.. పోలీసులకు ఫిర్యాదు!
వెంగళరావునగర్(హైదరాబాద్): బూతు పురాణాలతో మరోసారి కుర్చీతాత రచ్చకెక్కాడు. గతంలో అనేకమార్లు ప్రముఖ యూట్యూబ్ స్టార్స్ స్వాతినాయుడు, వైజాగ్ సత్యపై దుర్భాషలాడి పలు కేసుల్లో ఇరుక్కున్నాడు. చివరకు క్షమాపణలు కోరుతూ కేసులు లేకుండా చేసుకున్నాడు. అయితే మళ్లీ అదే తరహాలో బూతులు మాట్లాడుతున్నాడని బాధితులు మంగళవారం మధురానగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు, బాధితులు తెలియజేసిన వివరాలు.. రహమత్‌నగర్‌కు చెందిన కాలా పాషా అలియాజ్ కుర్చీ తాత మహేశ్‌బాబు సినిమాలోని కుర్చీ పాట ద్వారా యూ ట్యూబ్‌లో ఫేమస్ అయ్యాడు. అయితే, యూ ట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్ తీసే స్వాతినాయుడు, వైజాగ్ సత్యతో గతంలో సన్నిహితంగా ఉండేవాడు. అతని చెడు ప్రవర్తన కారణంగా వారు అతనిని దూరంగా ఉంచారు. దాంతో గతంలో వారిని తీవ్ర అసభ్య పదజాలంతో దుర్భాషలాడటంతో బాధితులు జూబ్లీహిల్స్, తర్వాత మధురానగర్ పీఎస్‌లో కేసులు పెట్టారు. అనంతరం కుర్చీతాత వారితో రాజీ కుదుర్చుకున్నాడు. తాజాగా మళ్లీ తమను తిడుతున్నాడంటూ స్వాతినాయుడు, వైజాగ్ సత్యలు మంగళవారం మధురానగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా, రెండు రాష్ట్రాలకు చెందిన ప్రస్తుత, మాజీ సీఎంలను, సినీరంగ ప్రముఖులను సైతం తిడుతున్నాడని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.


