ఇటీవలే సిగ్మా మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరో విజయ్ తనయుడు జేసన్ సంజయ్. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపర్చింది. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ఈ మూవీ అభిమానులను పెద్దగా ఆకట్టులేకపోయింది. దీంతో జేసన్ సంజయ్‌కు ఎంట్రీలోనే పెద్ద షాకింగ్ రిజల్ట్ వచ్చింది.
సిగ్మా తీవ్రంగా నిరాశపరచడంతో జేసన్ సంజయ్ రూట్ మార్చినట్లు తెలుస్తోంది. ఆయన త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. తండ్రి బాటలోనే పయనించేందుకు రెడీ అవుతున్నారని ఇన్‌సైడ్ టాక్. దర్శకత్వం వహించిన తొలి సినిమా ఫ్లాప్ కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అయితే ఈ ప్రాజెక్ట్‌పై ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు జరుగుతున్నాయని వార్తలొస్తున్నాయి. కానీ ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ‘సిగ్మా’ చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లోనే మళ్లీ పనిచేసేందుకు జేసన్ సంజయ్ ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రముఖ దర్శకుడు లింగుస్వామితో పాటు మరిన్ని కథలు నిర్మాతలు విన్నారని కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది. మరోవైపు బాబాయ్ సంజీవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది.


