సిగ్మా స్టైల్‌ | Vijay son Jason Sanjay launches his debut film Sigma first single | Sakshi
Sakshi News home page

సిగ్మా స్టైల్‌

Jun 5 2026 3:38 AM | Updated on Jun 5 2026 3:38 AM

Vijay son Jason Sanjay launches his debut film Sigma first single

సందీప్‌ కిషన్‌ హీరోగా నటించిన తాజా సినిమా ‘సిగ్మా’. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో రాజు సుందరం, సంపత్‌ రాజ్, శివ్‌ పండిట్, అంబు దాసన్, యోగ్‌ జాపీ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ తనయుడు జేసన్‌ సంజయ్‌ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 

లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మించిన ఈ సినిమా జూలై 31న విడుదల కానుంది. గురువారం ఈ సినిమా నుంచి ‘సిగ్మా స్టైల్‌’ అంటూ ఈ సినిమా మ్యూజిక్‌ వీడియోను మలయాళ నటుడు–నిర్మాత దుల్కర్‌ సల్మాన్‌ లాంచ్‌ చేశారు. ‘‘సందీప్‌–ఫరియాల డైనమిక్‌ పెర్ఫార్మెన్స్, ఈ చిత్రం మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ మాస్‌ ట్యూన్, జేసన్‌ సంజయ్‌ రాసిన క్యాచీ లిరిక్స్‌తో ‘సిగ్మా స్టైల్‌’ పాటను ఇన్‌స్టంట్‌ చార్ట్‌బస్టర్‌గా నిలబెట్టాయి’’ అని యూనిట్‌ పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement