వరలక్ష‍్మీ శరత్ కుమార్ 'పోలీస్ కంప్లెయింట్' | Varalaxmi Sarathkumar Police Complaint Movie First Look | Sakshi
Sakshi News home page

Varalaxmi Sarathkumar: వరలక్ష‍్మీ 'పోలీస్ కంప్లెయింట్'.. ఫస్ట్ లుక్ రిలీజ్

May 30 2025 6:19 PM | Updated on May 30 2025 6:55 PM

Varalaxmi Sarathkumar Police Complaint Movie First Look

దక్షిణాదిలో డిఫరెంట్ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఇప్పుడు తెలుగులో 'పోలీస్ కంప్లెయింట్' అనే మూవీ చేస్తోంది. ఇందులో వరలక్ష్మి ఫస్ట్ లుక్‌ని సూపర్‌స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా విడుదల చేశారు. పవర్‌ఫుల్ పోలీస్‌గా ఈమె కనిపించనుంది. ఈ చిత్రంలో కృష్ణ మీద స్పెషల్ సాంగ్ షూట్ చేసామని, అది సినిమాకే మెయిన్ హైలెట్ అని నిర్మాతలు చెబుతున్నారు.

(ఇదీ చదవండి: 'షష్టిపూర్తి' సినిమా రివ్యూ)

సింగపూర్ బాలకృష్ణ , మల్లెల ప్రభాకర్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ చంద్ర, కృష్ణ సాయి, రాగిణి ద్వివేది, రవిశంకర్, ఆదిత్య ఓం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ' అనే కాన్సెప్ట్ ఆధారంగా సినిమా తీశామని చెప్పిన దర్శకుడు సంజీవ్.. మనం చేసే ప్రతి చర్యకి ఫలితంగా అదే తిరిగి మనకే వస్తుందనే విషయాన్ని హారర్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో సరికొత్తగా చూపించబోతున్నామని అన్నారు. 

(ఇదీ చదవండి: భైరవం మూవీ రివ్యూ)

Advertisement
 
Advertisement
Advertisement