ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 24 మూవీస్.. ఆ నాలుగు స్పెషల్ | Here's The List Of 24 Upcoming Movies, Web Series Release In OTT July 1st Week 2024 | Sakshi
Sakshi News home page

This Week OTT Movie Releases: ఓటీటీల్లోకి 24 సినిమాలు.. ఎందులో ఏదంటే?

Published Mon, Jul 1 2024 7:53 AM | Last Updated on Mon, Jul 1 2024 8:50 AM

Upcoming OTT Release Movies Telugu July First Week 2024

గత శుక్రవారం థియేటర్లలో రిలీజైన 'కల్కి 2898 ఏడీ' రచ్చ లేపుతోంది. వీకెండ్ అయ్యేసరికి రూ.500 కోట్ల వసూళ్లు దాటేసింది. ఈ వారం పూర్తయ్యేసరికి రూ.1000 కోట్లు సాధించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఈ మూవీ ఆడుతోంది కాబట్టి ఈ వారం వేరే మూవీస్ ఏం రిలీజ్ కావట్లేదు. దీంతో ఆటోమేటిక్‌గా అందరి దృష్టి ఓటీటీల్లో వచ్చే మూవీస్‌పై పడుతుంది. ఈ వారం ఏకంగా 24 సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

(ఇదీ చదవండి: రామ్ చరణ్ ఇంట్లో సీక్రెట్‌గా ఉండేదాన్ని: మంచు లక్ష‍్మీ)

ఈ వారం పలు ఓటీటీల్లో ఏకంగా 24 సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో ఓ నాలుగు మాత్రం ఆసక్తి రేపుతున్నాయి. 'మీర్జాపుర్' సిరీస్ మూడో సీజన్‌తోపాటు గరుడన్, మలయాళీ ఫ్రమ్ ఇండియా, ఫ్యూరిసోయా మ్యాడ్ మ్యాక్స్ చిత్రాలు ఉన్నంతలో చూడాలనే ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. ఇవి కాకుండా వీకెండ్‪‌లో ఏమైనా సడన్ ఎంట్రీస్ వచ్చినా రావొచ్చు. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ వస్తుందంటే?

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ జాబితా (జూలై 01 నుంచి 07 వరకు)

నెట్‌ఫ్లిక్స్

 • అల్విన్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 01

 • స్టార్ ట్రెక్ ప్రొడిగీ: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 01

 • స్ప్రింట్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 02

 • బేవర్లీ హిల్స్ కాప్: అలెక్సా ఎఫ్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 02

 • ద మ‍్యాన్ విత్ 1000 కిడ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 03

 • బార్బెక్యూ షో డౌన్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 04

 • రైమ్ ప్లస్ ఫ్లో ఫ్రాన్స్ సీజన్ 3 (ఫ్రెంచ్ సిరీస్) - జూలై 04

 • డెస్పరేట్ లైస్ (పోర్చుగీస్ సిరీస్) - జూలై 05

 • గోయో (స్పానిష్ మూవీ) - జూలై 05

హాట్‌స్టార్

 • రెడ్ స్వాన్ (కొరియన్ సిరీస్) - జూలై 03

 • ల్యాండ్ ఆఫ్ తనబతా (జపనీస్ సిరీస్) - జూలై 04

అమెజాన్ ప్రైమ్

 • బాబ్ మార్లీ: వన్ లవ్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 03

 • గరుడన్ (తమిళ సినిమా) - జూలై 03

 • స్పేస్ క్యాడెట్ (ఇంగ్లీష్ చిత్రం) - జూలై 04

 • మీర్జాపుర్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 05

   

జియో సినిమా

 • ప్రైమ్ టైమ్ విత్ మూర్తీస్ (హిందీ సిరీస్) - జూలై 03

 • హీ వెంట్ దట్ వే (ఇంగ్లీష్ మూవీ) - జూలై 05

ఆహా

 • హరా (తమిళ సినిమా) - జూలై 05

బుక్ మై షో

 • ఇఫ్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 03

 • ఫ్యూరోసియా: ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా (ఇంగ్లీష్ మూవీ) - జూలై 04

 • ద సీడింగ్ (ఇంగ్లీష్ ఫిల్మ్) - జూలై 05

 • విజన్స్ (ఫ్రెంచ్ సినిమా) - జూలై 05

సోనీ లివ్

 • మలయాళీ ఫ్రమ్ ఇండియా (మలయాళ మూవీ) - జూలై 05

మనోరమ మ్యాక్స్

 • మందాకిని (మలయాళ సినిమా) - జూలై 05

(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ డీటైల్స్.. అప్పటివరకు వెయిటింగ్ తప్పదా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement