 
													మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చిందంటే ఏ ఎమోషన్ అయినా ఇట్టే పండించగలదు. అందుకే శక్తిమాన్ సహా 150కి పైగా సీరియల్స్ చేసింది. ఎక్కువగా గ్లామరస్‌గానే కనిపించేది. కానీ, సడన్‌గా తనకు అన్నింటిపైనా విరక్తి వచ్చింది. బంధాలు, బాంధవ్యాలు అన్నింటినీ కాదనుకుని సన్యాసం పుచ్చుకుంది. పీంతబర మాగా మారింది. హిమాలయాల్లో సన్యాసిగా జీవిస్తోంది.
జీవితంపై విరక్తి
తాజాగా ఓ ఇంటర్వ్యూలో నుపుర్ అలంకార్ (Nupur Alankar) అనేక ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. గూగుల్‌లో చూస్తే నా జీవితంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుస్తుంది. పీఎంసీ (పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్) బ్యాంక్ కుంభకోణం జరిగినప్పుడు జీవితంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాను. ఈ స్కామ్ తర్వాతే అమ్మ అనారోగ్యంపాలైంది. మెరుగైన చికిత్స అందించడనికి బ్యాంకులో డబ్బున్నా.. దాన్ని బయటకు తీసుకుని వాడలేని పరిస్థితి. అమ్మ, సోదరి చావులు చూశాక నా జీవితం కూడా ముగిసిపోయిందనుకున్నా.. ఈ ప్రపంచానికి దూరంగా ఉండాలనుకున్నాను. 
భిక్షాటన
అందుకే అన్ని కనెక్షన్లు తెంచేసుకున్నాను. ప్రాపంచిక జీవితానికి దూరంగా.. ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నాను. ఆధ్యాత్మిక జీవితంలో సంతోంషంగా ఉన్నాను. ఇక్కడ భిక్షాటన ఉంటుంది. నేను కూడా భిక్షాటన చేస్తుంటాను. అందరూ నాకు దానధర్మాలు చేసినదాంట్లో కొంత దేవుడికి, మరికొంత నా గురువుకి ఇస్తాను. ఈ భిక్షాటన వల్ల మనిషిలో ఇగో అనేది చచ్చిపోతుంది. ఇకపోతే నాలుగైదు జతల బట్టలతోనే కాలం గడిపేస్తున్నాను. ఆశ్రమానికి వచ్చేవారు కొన్నిసార్లు దుస్తులు కూడా ఇస్తుంటారు. వాటినే ఉపయోగిస్తూ ఉంటాను. కొన్నిసార్లు మంచు తుఫానులు వంటివి వచ్చినప్పుడు గుహలో జీవించాను అని చెప్పుకొచ్చింది.
PMB స్కామ్..
నటి నుపుర్ సన్యాసం పుచ్చుకోవడానికి ప్రధాన కారణం తల్లి, సోదరి చావు! ఆ చావులకు ప్రధాన కారణం 2019లో జరిగిన పీఎంసీ బ్యాంక్ స్కామ్. వేల కోట్ల స్కామ్ వెలుగులోకి వచ్చినవెంటనే ఆర్‌బీఐ.. పీఎంబీ బ్యాంక్‌పై ఆరునెలలపాటు ఆంక్షలు విధించింది. వినియోగదారులు కేవలం రూ.1000 మాత్రమే నగదు విత్‌డ్రా చేసుకోవచ్చని కఠిన నిబంధనలు పెట్టింది. దీంతో ఆ బ్యాంక్‌లో నగదు డిపాజిట్ చేసుకున్న వినియోగదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తర్వాత విత్‌డ్రా పరిమితులను సవరించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 200 మందికి పైగా కస్టమర్లు ప్రాణాలు కోల్పోయారు.
చదవండి: వాళ్లందరూ సర్వనాశనం అయిపోతారు.. మంచు లక్ష్మి శాపనార్థాలు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
