వెంకీ-అనిల్ మూవీ లాంఛ్.. రాఘవేంద్రరావు తీరుపై విమర్శలు..! | Trolls on Director Raghavaendra Rao Behaviour with actress Kriti Shetty | Sakshi
Sakshi News home page

Raghavaendra Rao: మూవీ లాంఛ్ ఓకే.. మీకు ఇదేం పని సార్..!

Jun 18 2026 1:51 PM | Updated on Jun 18 2026 2:23 PM

Trolls on Director Raghavaendra Rao Behaviour with actress Kriti Shetty

వెంకీమామ- అనిల్ రావిపూడి కాంబోలో మరో చిత్రం రానుంది.  ఇప్పటికే ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ మూవీ కల్యాణ్ రామ్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కృతిశెట్టి, కీర్తి సురేశ్‌ను హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ రోజే అధికారికంగా షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీ షూటింగ్‌ లాంఛ్ చేయడానికి నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు రాఘవేంద్రరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహుర్తపు షాట్‌కు అల్లు అరవింద్  క్లాప్ కొట్టారు.

ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ఫస్ట్ షాట్‌కి డైరెక్షన్ చేసిన రాఘవేంద్రరావు వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు కారణమైంది. హీరోయిన్ కృతి శెట్టి భుజంపై తన చేయి పెట్టి మరి మాట్లాడుతూ కనిపించారు. దర్శకత్వం వరకు ఓకే కానీ.. యంగ్ హీరోయిన్‌ భుజంపై చేతులు వేయాల్సిన అవసరం ఏముందని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. దీంతో హీరోయిన్‌తో ఆయన వ్యవహరించిన తీరుపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. ఏదేమైనా టాలీవుడ్‌ పేరున్న డైరెక్టర్‌ ఇలా వ్యవహరించడం సరికాదని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. r
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement