Trisha Krishnan Clarity On Her Political Entry In Tamilnadu - Sakshi
Sakshi News home page

Trisha Krishnan : హీరోయిన్‌ త్రిష కాంగ్రెస్‌ పార్టీలో చేరనుందా? అందుకే సినిమాలు ఒప్పుకోవట్లేదా?

Dec 26 2022 1:50 PM | Updated on Dec 26 2022 2:53 PM

Trisha Krishnan Clarity On Her Political Entry In Tamilnadu - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ త్రిష పొలిటికల్‌ ఎంట్రీపై గత కొన్నిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.  త్వరలోనే ఆమె కాంగ్రెస్‌ పార్టీలోకి చేరుతుందంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇదివరకే ఈ విషయంపై త్రిష తల్లి ఉమా కృష్ణన్ క్లారిటీ ఇచ్చినా రూమర్స్‌కి తెరపడలేదు. పొన్నియిన్‌ సెల్వన్‌ తర్వాత వరుస అవకాశాలు వస్తున్నా ఆపర్స్‌ను తిరస్కరిస్తుండటంతో త్వరలోనే ఆమె పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తుందంటూ వార్తలు ఊపందుకున్నాయి. 

తాజాగా ఈ వార్తలపై త్రిష స్పందించింది. ప్రస్తుతానికి తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని తేల్చి చెప్పింది. కాంగ్రెస్‌లో చేరుతున్నానని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, అయినా సోషల్‌ మీడియాలో వస్తున్న రూమరర్లపై స్పందించాల్సిన అవసరం తనకు లేదని తేల్చి చెప్పింది. ఇప్పుడు తన ఫోకస్‌ అంతా సినిమాలపైనే ఉందని పేర్కొంది. ఇ​‍దిలా ఉంటే త్రిష నటింఇచన రాంగీ సినిమా త్వరలోనే విడుదల కానుంది. 


 

Advertisement
 
Advertisement
Advertisement