Tollywood Tv Actress Lahari Baby Shower Photos Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Lahari Baby Shower Photos: మొగలి రేకులు నటి లహరి సీమంతం.. సోషల్ మీడియాలో వైరల్!

Jun 11 2023 7:19 PM | Updated on Jun 12 2023 11:52 AM

Tollywood Tv Actress Lahari Baby Shower Photos Goes Viral - Sakshi

ప్రముఖ బుల్లితెర నటి లహరి తెలుగువారి సుపరిచితమే. మొగలి రేకులు, ముద్దుబిడ్డ వంటి సీరియ‍ల్స్‌తో ఫేమ్ తెచ్చుకుంది. సీరియల్స్‌తో పాటు టీవి షోస్‌, సినిమాల్లోనూ మెప్పించింది. ప్రస్తుతం ఇంటింటికి గృహలక్ష్మి అనే సీరియల్‌లో నటిస్తోంది. అయితే పెళ్లి తర్వాత కాస్తా నటనకు కాస్త గ్యాప్ ఇచ్చిన లహరి ప్రెగ్నెన్సీ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్న లహరి సీమంతం వేడుక ఇటీవలే ఘనంగా నిర్వహించారు.  

(ఇది చదవండి: థియేటర్లో లైంగిక వేధింపులు.. ఏం చేయాలో అర్థం కాలేదు: స్టార్ హీరోయిన్)

కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకను పలువురు బుల్లితెర నటీనటులు పాల్గొన్నారు. ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ కూడా నడుపుతున్న సీమంతానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకున్నారు. లహరి సీమంతం వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.  

(ఇది చదవండి: సీతగా నన్నే ఎందుకు ఎంపిక చేశారంటే: కృతి సనన్‌)

Advertisement
 
Advertisement
Advertisement