రచయితగా మారిన టాలీవుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌! | Tollywood Music Director Sri Vasanth Turns To Be Writer | Sakshi
Sakshi News home page

Sri Vasanth: రచయితగా మారిన సంగీత దర్శకుడు శ్రీ వసంత్

Jun 14 2024 10:03 PM | Updated on Jun 15 2024 11:02 AM

Tollywood Music Director Sri Vasanth Turns To Be Writer

అల్లరి నరేష్ చిత్రం సుడిగాడు సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమైన శ్రీ వసంత్. టాలీవుడ్‌లో పలు సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశారు. తాజాగా విజయ్ సేతుపతి హీరోగా నటించిన మహారాజా సినిమాకు శ్రీ వసంత్ సాంగ్స్‌, మాటలు రాశారు. నిధిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం జూన్‌ 14న థియేటర్లలో రిలీజైంది. విజయ్ సేతుపతి నటించిన 50వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహారాజ ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరిస్తోంది.ఒక మంచి సినిమాకు  మాటలు, పాటలు రాయడం సంతోషాన్ని కలిగిస్తుందని శ్రీ వసంత్ తెలిపారు.

మహారాజ సినిమాలోని "అమ్మ నీకే నాన్నయ్యనా" అంటూ సాగే పాటలు శ్రీ వసంత్ స్వరాలు పాపులర్ అ‍య్యాయి. అజనీస్ లోకనాధ్ సంగీతం పాటకు మరో బిగ్ అడ్వాంటేజ్‌. దీంతో మహారాజ సినిమాకు విడుదలైన రోజే మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అలాగే మహారాజా సినిమాకు రివ్యూస్‌లోనూ మాటలు, పాటల గురించి కూడా పాజిటివ్‌గా రాసుకొచ్చారు. శ్రీ వసంత్ స్వీయ డబ్బింగ్ కంపెనీ పోస్ట్ ప్రో మీడియా వర్క్స్‌లో మాహారాజ సినిమా డబ్బింగ్ పూర్తి చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement