కోనసీమ ప్రేమకథా చిత్రం.. ఆసక్తిగా ట్రైలర్!

Tollywood Latest Movie I Hate Love Trailer Out Today - Sakshi

సుబ్బు ,శ్రీవల్లి , కిట్టయ్య ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం  'ఐ హేట్ లవ్'. నేనూ ప్రేమలో పడ్డాను అనేది ఉప శీర్షిక.  ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 16న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా గుడుంబా శంకర్ చిత్ర దర్శకుడు వీరశంకర్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. 

ఈ సందర్భంగా వీరశంకర్  మాట్లాడుతూ..'ట్రైలర్ చాలా బాగుంది  సహజత్వంగా బాగా చిత్రీకరించారు. అన్ని వర్గాలవారికి ఈ చిత్రం నచ్చుతుంది. మంచి చిత్రాన్ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు' అని అన్నారు. నిర్మాత  డాక్టర్ బాల రవి మాట్లాడుతూ కథ పరంగా  ఎక్కడ రాజీపడకుండా అద్భుతంగా తెరకెక్కించామన్నారు. గోదావరి ఒడ్డున కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మా సినిమా అంత ప్రశాంతంగా చూడవచ్చని తెలిపారు. 

దర్శకుడు వెంకటేష్ మాట్లాడుతూ..' గోదావరి జిల్లా యాసతో  పూర్తిగా కోనసీమ పరిసర ప్రాంతాల్లో  షూటింగ్ చేయడం జరిగింది. ఇది యూత్‌ను బాగా ఆకట్టుకునే సందేశాత్మక కథ.  పెద్దపల్లి రోహిత్ సంగీతాన్ని అందించారు. పాటలకి మంచి స్పందన వచ్చింది, మా సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా' అని అన్నారు. ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏస్‌కేఎల్‌ఎమ్ మోషన్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ కాబోతుంది అన్నారు.

whatsapp channel

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top