శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్ | Sakshi
Sakshi News home page

Sumaya Reddy: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలుగు హీరోయిన్

Published Mon, Mar 4 2024 9:57 PM

Tollywood Heroine Sumaya Reddy Visits TTD Temple Today Before Movie Release - Sakshi

తెలుగమ్మాయి హీరోయిన్‌గా, నిర్మాతగా మారి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం అంటే సాధారణమైన విషయం కాదు. ‘డియర్ ఉమ’ సినిమాతో నిర్మాత, హీరోయిన్‌గా తెరపైకి రాబోతున్నారు. ఈ చిత్రంలో  తెలుగుమ్మాయి సుమయ రెడ్డి, దియా మూవీ ఫేమ్ పృథ్వీ అంబర్ జంటగా నటించారు. ఈ మూవీని సుమయ రెడ్డి నిర్మించగా.. సాయి రాజేష్ మహాదేవ్ దర్శకత్వం వహించారు.  సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

తాజాగా సుమయా రెడ్డి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శ్రీవారికి తన మొక్కులు చెల్లించుకున్నారు.  ఇప్పటికే సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు ఇటీవలే సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను విశేష స్పందన లభించింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించనున్నారు. 


Advertisement
 
Advertisement