లిప్‌లాక్‌ సీన్స్‌ వద్దని మా నాన్న చెప్పారు: హీరోయిన్‌ | Preethi Pagadala Comments On Lip-Lock Scenes | Sakshi
Sakshi News home page

లిప్‌లాక్‌ సీన్స్‌ వద్దని మా నాన్న చెప్పారు: హీరోయిన్‌

Apr 14 2024 2:18 PM | Updated on Apr 14 2024 3:07 PM

Tollywood Heroine Comments On LipLock - Sakshi

ఇన్‌స్టాగ్రామ్‌ సెన్సేషన్ ప్రీతి పగడాల సోషల్‌ మీడియాలో తన యూజర్స్‌కు బాగా టచ్‌లో ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటోలు, వీడియోలతో అభిమానులకు మరింత దగ్గరవుతుంది. అమెరికన్ యాసెంట్‌లో తెలుగు మాట్లాడుతున్న ఈ బ్యూటీ వీడియోలకు ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. అలా నెట్టింట ఆమె పేరు బాగానే వైరల్‌ అయింది. తాజాగా  ఈ బ్యూటీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. పతంగ్‌ అనే సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెడుతుంది. ఈ క్రమంలో తన తల్లిదండ్రులు పెట్టిన కండీషన్స్‌ గురించి ఆమె పంచుకుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రీతి పగడాలకు ఒక ప్రశ్న ఎదురైంది. అవకాశం వస్తే ఇంటిమేట్‌ సీన్లతో పాటు లిప్‌లాక్‌ వంటి వాటికి ఓకే చెప్తావా అని అడిగితే.. అందుకు ఆమె నో అంటూనే ఇలా చెప్పింది. ' సినిమాల్లోకి అడుగుపెడుతున్నప్పుడు మా నాన్నగారు ఒక కండీషన్‌ పెట్టారు. లిప్‌లాక్‌ సీన్లు వద్దన్నారు. నేను అడిగిన ప్రతిదానికి వారు అంగీకరించారు. అలాంటప్పుడు నాన్నగారు పెట్టిన ఆ ఒక్క కండీషన్‌ను దాటకూడదని నిర్ణయించుకున్నాను. ఇప్పటికే ఇంటిమేట్‌ సీన్లు చేస్తారా అని ఆఫర్లు వచ్చాయి కానీ నేను ఒప్పుకోలేదు. ఒకవేళ పరిమితిమేరకు ఇంటిమేట్‌ సీన్లు ఉంటే చేస్తాను. గ్లామర్‌గా కనిపిండంలో ఎలాంటి కండీషన్లు లేవు. ఎందుకంటే ఈరోజుల్లో ఎటూ షార్ట్‌గా ఉన్న డ్రస్‌లను ఉపయోగించడం సాధారణం.' అని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది.

ప్రీతి పగడాల తాజాగా నటించిన చిత్రం పతంగ్‌. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిష‌న్ సినిమాస్ ప‌తాకంపై విజ‌య్ శేఖ‌ర్ అన్నే, సంప‌త్ మ‌క, సురేష్ కొత్తింటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌ణీత్ ప్ర‌త్తిపాటి పతంగ్‌ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా నాని బండ్రెడ్డి క్రియేటివ్ నిర్మాతగా ఉన్నారు. ప్ర‌ముఖ సింగ‌ర్ ఎస్‌పీ చ‌ర‌ణ్ ఈ చిత్రంలో కీల‌క‌మైన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. జీ స‌రిగ‌మ‌ప ర‌న్న‌ర‌ప్ ప్ర‌ణ‌వ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ముఖ్య‌తార‌లుగా న‌టిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement