మనం డైెరెక్టర్‌తో విజయ్ దేవరకొండ.. వర్కవుట్ అవుతుందా? | Vijay Deverakonda Rumored To Team Up With Director Vikram Kumar For Pan India Film, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Vijay devarakonda: మనం డైెరెక్టర్‌తో పాన్ ఇండియా మూవీ.. వర్కవుట్ అవుతుందా?

Jun 13 2026 8:06 PM | Updated on Jun 13 2026 8:20 PM

Tollywood Hero Vijay devarakonda acts with this director goes Viral

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలి సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ గండకోటలో జరిగింది. ఈ షెడ్యూల్‌లో దాదాపు వారం రోజుల పాటు కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న కథ కావడంతో ఎక్కువ శాతం అక్కడే షూట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు.

తాజాగా విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ క్రేజీ టాక్ వినిపిస్తోంది. విజయ్ మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 24 మూవీ డైరెక్టర్ విక్రమ్ కుమార్‌తో మన టాలీవుడ్ హీరో జత కట్టనున్నారని లేటేస్ట్ టాక్. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ను మడాక్ ఫిల్మ్స్ నిర్మించనుందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే అరుదైన కాంబోగా నిలవనుంది. కాగా.. విక్రమ్ కుమార్ తెలుగులో మనం, ఇష్క్ థ్యాంక్ యూ, హలో, గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాలను తెరకెక్కించారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement