డ్రగ్స్‌ కేసు: కెల్విన్‌, ఎఫ్‌ క్లబ్‌తో చాటింగ్‌పై రకుల్‌ను ప్రశ్నిస్తున్న ఈడీ | Tollywood Drugs Case: Rakul Preet Singh Questioned By ED Over Her Bank Transaction | Sakshi
Sakshi News home page

Tollywood Drugs Case: రకుల్‌పై ఈడీ ప్రశ్నల వర్షం

Sep 3 2021 4:42 PM | Updated on Sep 3 2021 6:40 PM

Tollywood Drugs Case: Rakul Preet Singh Questioned By ED Over Her Bank Transaction - Sakshi

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో విచారణ కొనసాగుతుంది. నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఎదుట హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.  అయిదు గంటలుగా ఈడీ అధికారులు రకుల్‌ ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణలో తన మూడు బ్యాంక్‌ అకౌంట్ల లావాదేవిల వివరాలపై ఈడీ విచారిస్తోంది. ఆడిటర్‌తో పాటు రకుల్‌ను ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు. ఈ క్రమంలో ఎఫ్‌ క్లబ్‌ మేనేజర్‌, డ్రగ్‌ డీలర్‌ కెల్విన్‌తో ఆమె జరిపిన బ్యాంక్‌ లావాదేవిలు, చాటింగ్‌పై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్న తన మూడు ఫిట్‌సెంటర్లపై ఆరా తీస్తున్నా అధికారులు. అలాగే పలు అనుమానిత ట్రాన్సెక్షన్లపై కూడా ఈడీ అధికారులు రకుల్‌ను ప్రశ్ని‍స్తున్నారు.   

డ్రగ్‌ పెడ్లర్‌ కెల్విన్‌ ఇచ్చిన సమాచారంతో రకుల్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. రకుల్‌ను ఈ రోజు ఉదయం 10:30 గంటలకు ఈడీ కార్యాలయానికి రావాల్సిందిగా అధికారులు నోటీసులో పేర్కొనగా 9:10 గంటలకే ఆమె ఈడీ కార్యాలయానికి చేరుకుంది. చేతిలో ఓ ఫైల్‌ పట్టుకొని చార్టెడ్ అకౌంటెంట్, న్యాయవాది, మేనేజర్‌తో కలిసి రకుల్‌ ఈడీ ఆఫీసుకు వచ్చింది. కాగా ఈ డ్రగ్‌ కేసులో ఇప్పటికే డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌, నటి  చార్మీలను ఈడీ విచారించిన సంగతి విధితమే. ఈ నేపథ్యంలో తమ బ్యాంకు ఖాతాల వివరాలను ఈడీ అధికారులు వారు సమర్పించారు

Advertisement
 
Advertisement
Advertisement