Tollywood Director NSR Prasad Passed Away - Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌లో విషాదం.. క్యాన్సర్‌తో దర్శకుడు కన్నుమూత!

Jul 29 2023 2:16 PM | Updated on Jul 29 2023 2:23 PM

Tollywood Director NSR Prasad Passed Away - Sakshi

టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు ఎన్‌ఎస్సార్‌ ప్రసాద్‌(49) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు.

‘సీతారామ్’ గా పరిశ్రమ వర్గాలకు సుపరిచితుడైన ప్రసాద్.. ఆర్యన్ రాజేష్ హీరోగా నటించిన ‘నిరీక్షణ’తో దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత శ్రీకాంత్‌తో ‘శత్రువు’, నవదీప్‌తో ‘నటుడు’ అనే చిత్రాలను తెరకెక్కించాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘రెక్కి’ విడుదల సన్నాహాల్లో ఉంది. పలువురు ప్రముఖ దర్శకుల వద్ద రైటర్ గా, ఘోస్ట్ రైటర్ గా పనిచేశాడు.  సీతారామ్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్, పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement