Actress Gayathri Gupta Shares Stunning Video On Instagram; Video Viral - Sakshi
Sakshi News home page

Gayathri Gupta: గాయత్రి గుప్తా.. ఆ ఒక్క వీడియోతో తగ్గేదేలే అంటోంది!

Aug 9 2023 7:17 PM | Updated on Aug 9 2023 8:03 PM

Tollywood Actress Gayathri Gupta Shares Stunning Video Goes Viral - Sakshi

షార్ట్ ఫిల్మ్స్‌తో కెరియర్ స్టార్ట్ చేసి గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి గాయత్రి గుప్తా. ఆ తర్వాత ఫిదా, కొబ్బరి మట్ట, ఐస్ క్రీం లాంటి చిత్రాల్లో నటించింది. అయితే గాయత్రి గుప్తా హీరోయిన్‌గా చేయకపోయినప్పటికీ పలు చిత్రాల్లో కనిపించింది. రవితేజ మూవీ అమర్ అక్బర్ ఆంటోనీ, బుర్రకథ, ఐస్‌క్రీమ్-2, దుబాయ్ రిటర్న్, జంధ్యాల రాసిన ప్రేమకథ, సీతా అన్‌ ది రోడ్, కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ లాంటి సినిమాలు చేసింది.  అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ తెగ వైరలవుతోంది. 

(ఇది చదవండి: 'దేవర' తర్వాత జాన్వీని తమిళ్‌కు పరిచయం చేయనున్న టాప్‌ హీరో)

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే అమ్మడు అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. తాజాగా గాయత్రి తన ఇన్‌స్టాలో షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరి ఇంత బోల్డ్‌గా వీడియో చేయడమేంటని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా బోల్డ్ కామెంట్స్ పెడుతున్నారు.  

కాగా.. గతంలో తన బాయ్‌ఫ్రెండ్‌ తనను మోసం చేశాడని తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. గాయత్రికి గతంలోనే పెళ్లి కాగా.. అతనితో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. కాగా.. ప్రస్తుతం జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, రమ్య, విష్ణుప్రియ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన వెబ్ సిరీస్‌లో గాయత్రి గుప్తా నటించింది. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీ ఫ్లాట్‌పామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 

(ఇది చదవండి: జూనియర్ ఎన్టీఆర్ న్యూ లుక్.. అదిరిపోయిందిగా! )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement