Jr NTR Stylish Makeover Look For Devara Goes Viral - Sakshi
Sakshi News home page

Jr NTR New Look: ఎన్టీఆర్ లుక్ మామూలుగా లేదుగా.. ఆ సినిమా కోసమేనా?

Aug 9 2023 6:25 PM | Updated on Aug 9 2023 8:31 PM

Jr NTR stylish makeover Look for Devara goes viral - Sakshi

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ తర్వాత నటిస్తోన్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ భామ శ్రీదేవి కూతురు టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. సముద్రం నేపథ్యంలో సాగే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.   అయితే తాజాగా  యంగ్ టైగర్ ఫోటో నెట్టింట తెగ వైరలవుతోంది.  తాజా లుక్‌లో ఎన్టీఆర్‌ మరింత స్టైలిష్‌గా కనిపించారు. దీంతో అభిమానులు జూనియర్ న్యూ లుక్‌పై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్‌ను చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.

(ఇది చదవండి:  చంద్రముఖి చైల్డ్‌ ఆర్టిస్ట్‌ ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తుందంటే?)

అయితే దేవర కొత్త షూటింగ్ షెడ్యూల్‌  త్వరలోనే  హైదరాబాద్‌లో ప్రారంభం కానున్నట్లు  జరుగుతోంది.  దేవర కోసమే సరికొత్త మేకోవర్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తోన్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌, ఎన్టీఆర్ మధ్య ఓ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇటీవలే దేవర మూవీ రిలీజ్‌కు సంబంధించి మేకర్స్ ప్రత్యేక వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే.  250 రోజుల్లోనే దేవర ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ పాన్-ఇండియా మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 


 
గతంలో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఆ మూవీ తర్వాత మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు.  అంతే కాకుండా ఈ సినిమా కోసం విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్‌స్థాయిలో ఉండేలా బ్రాడ్ మిన్నిచ్ పనిచేస్తున్నారు. 

(ఇది చదవండి: 'దేవర' తర్వాత జాన్వీని తమిళ్‌కు పరిచయం చేయనున్న టాప్‌ హీరో)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement