యాడున్నాడో.. పాటతో దుమ్మురేపిన సింగర్‌ మంగ్లీ.. | Yaadunnado Yaadunnado Lyrical Song Out From Theppa Samudram Movie - Sakshi
Sakshi News home page

'తెప్ప సముద్రం'లో సింగర్‌ మంగ్లీ పాడిన పాట విన్నారా?

Sep 20 2023 6:42 PM | Updated on Sep 20 2023 6:59 PM

Theppa Samudram Movie: Yadunnado Song Out Now - Sakshi

“తెప్ప సముద్రం” కథ బాగా నచ్చి ఖర్చుకు వెనకాడకుండా నిర్మించడం జరిగింది. సినిమా కూడా అద్భుతంగా వచ్చింది. అయితే ఈరోజు సింగర్ మంగ్లీ పడిన మాస్ బీట్

అర్జున్ అంబటి, చైతన్యరావు హీరోలుగా 'కొరమీను' ఫేమ్ కిశోరి దాత్రక్ హీరోయిన్‌గా నటించిన చిత్రం 'తెప్ప సముద్రం'. రవి శంకర్ ప్రధాన పాత్రలో నటించగా సతీష్ రాపోలు దర్శకత్వం వహించాడు. శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నీరుకంటి రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి పి.ఆర్ మ్యూజిక్ అందించాడు. అయితే వినాయక చవితి సందర్భంగా సినీ ప్రేక్షకులను తన గాత్రంతో ఉర్రూతలూగిస్తోన్న సింగర్ మంగ్లీ పడిన మాస్ బీట్ పాట “యాడున్నాడో” ను ఎమ్ ఆర్ టి (MRT) ఆడియో ద్వారా విడుదల చేసారు.

ఈ సందర్భంగా నిర్మాత రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ “తెప్ప సముద్రం” కథ బాగా నచ్చి ఖర్చుకు వెనకాడకుండా నిర్మించడం జరిగింది. సినిమా కూడా అద్భుతంగా వచ్చింది. అయితే ఈరోజు సింగర్ మంగ్లీ పడిన మాస్ బీట్ పాట “యాడున్నాడో” ను ఎమ్ ఆర్ టి (MRT) ఆడియో ద్వారా విడుదల చేస్తున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటిస్తాం" అని తెలిపారు.

దర్శకుడు సతీష్ రాపోలు మాట్లాడుతూ “గత పదేళ్లుగా చిత్ర పరిశ్రమలో దర్శకత్వ శాఖలో పని చేసాను. తెప్ప సముద్రం కథ చాలా కొత్తగా ఉంటుంది. మంచి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. షూటింగ్ అంత పూర్తి అయింది. వినాయక చవితి సందర్భంగా సింగర్ మంగ్లీ గారు పడిన యాడున్నాడో పాట ను విడుదల చేస్తున్నాం. పి.ఆర్ గారు అద్భుతమైన పాటలు అందించారు. సినిమా ని త్వరలోనే విడుదల చేస్తాము" అని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement