
టాలీవుడ్ హీరో నితిన్.. గతేడాది సెప్టెంబరులోనే తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అయితే అప్పటినుంచి కొడుకు ఫొటోలు, వీడియోలు లాంటివి పెద్దగా బయటపెట్టలేదు. అలానే పేరు ఏం పెట్టారనేది కూడా చెప్పలేదు. ఇప్పడు మంచిరోజు చూసుకుని మరీ గుడ్ న్యూస్ చెప్పాడు. తన కుమారుడికి ఏం పేరు పెట్టామనేది సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
(ఇదీ చదవండి: 'కూలీ' vs 'వార్ 2'.. రెండు రోజుల కలెక్షన్ ఎవరికెంత?)
2020లో నితిన్.. షాలినీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరూ తొలుత ప్రేమించుకున్నారు. అనంతరం పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. గతేడాది సెప్టెంబరు 6న తన భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని నితిన్ బయటపెట్టాడు. ఇప్పుడు దాదాపు 11 నెలల తర్వాత కృష్ణాష్టమి సందర్భంగా తన కుమారుడికి 'అవ్యుక్త్' అని పేరు పెట్టినట్లు చెప్పుకొచ్చాడు.
నితిన్ సినిమాల విషయానికొస్తే.. గత కొన్నేళ్లలో వరసపెట్టి తీస్తున్న మూవీస్ అన్నీ ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో 'రాబిన్ హుడ్' చిత్రంతో రాగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. గత నెలలో 'తమ్ముడు' అని పలకరించాడు. ఇది కూడా ఘోరమైన డిజాస్టర్‌గా మిగిలింది. ప్రస్తుతానికైతే 'బలగం' దర్శకుడు వేణు తీయబోయే 'ఎల్లమ్మ' అనే మూవీ చేయాల్సి ఉంది. మరి ఇది ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
(ఇదీ చదవండి: 'కూలీ'తో సక్సెస్.. కాస్ట్‌లీ కారు కొన్న నటుడు సౌబిన్ షాహిర్)