పాన్‌ ఇండియాను టార్గెట్‌ చేసిన ఆర్య | Tamil Actor Arya Target Pan India - Sakshi
Sakshi News home page

పాన్‌ ఇండియాను టార్గెట్‌ చేసిన ఆర్య

Aug 25 2023 2:02 PM | Updated on Aug 25 2023 2:53 PM

Tamil Actor Arya Target Pan India - Sakshi

కోలీవుడ్‌ నటుడు ఆర్య కథానాయకుడిగా నటిస్తున్న నూతన చిత్రం 'మిస్టర్‌ ఎక్స్‌'. గతేడాదిలో విడుదల అయిన 'కెప్టెన్‌' సినిమా అంతగా మెప్పించలేదు. ఆ సినిమా తర్వాత వస్తున్న 'మిస్టర్‌ ఎక్స్‌' సినిమాను పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల చేసి హిట్‌ కొట్టాలని ప్లాన్‌లో ఆయన ఉన్నారు. ఇందులో నటుడు గౌతమ్‌ కార్తీక్‌ ప్రతి నాయకుడిగా నటించడం విశేషం. నటుడు శరత్‌ కుమార్‌, నటి మంజూవారియర్‌, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇంతకు ముందు ఎఫ్‌ఐఆర్‌ వంటి సక్సెస్‌ ఫుల్‌ చిత్రాన్ని డైరెక్ట్‌ చేసిన ఆనంద్‌నే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

(ఇదీ చదవండి:  అవమానాలు భరించి వెండితెరపై సత్తా చాటిన అల్లు అర్జున్‌)

ప్రిన్స్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది. దౌనోకి దీపు నీనన్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కొంతమంది వల్ల దేశానికి ప్రమాదం ఏర్పడితే  దేశాన్ని రక్షించే హీరోగా అర్య కనిపించనున్నారు.చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది విభిన్న యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాచిత్రంగా ఉంటుందన్నారు.

ముఖ్య సన్నివేశాలను ఉగాండా, సిరియా దేశాల్లో చిత్రీకరించనున్నట్లు చెప్పారు. కాగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర వర్గాలు విడుదల చేశాయి. మిస్టర్‌ ఎక్స్‌ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను తదుపరి వెల్లడించనున్నట్లు దర్శకుడు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement