నా ముందు సైలెంట్‌గా ఉండాలి! | Sreeleela turns lady boss Neera Vasudev for Robinhood | Sakshi
Sakshi News home page

నా ముందు సైలెంట్‌గా ఉండాలి!

Jun 15 2024 3:59 AM | Updated on Jun 15 2024 4:00 AM

Sreeleela turns lady boss Neera Vasudev for Robinhood

తెలుగు చిత్ర పరిశ్రమలో బిజీగా దూసుకెళుతున్నారు యంగ్‌ బ్యూటీ శ్రీలీల. ప్రస్తుతం నితిన్‌తో ‘రాబిన్‌హుడ్‌’, రవితేజ ‘ఆర్‌టీ 75’ (వర్కింగ్‌ టైటిల్‌) వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. కాగా శుక్రవారం (మే 14) శ్రీలీల బర్త్‌డే. ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ‘రాబిన్‌హుడ్‌’లో ఆమె చేస్తున్న లేడీ బాస్‌ నీరా వాసుదేవ్‌ ΄పాత్ర లుక్, టీజర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

‘‘జ్యోతీ... సునామీలో టి సైలెంట్‌ ఉండాలి... నా ముందు నువ్వు సైలెంట్‌గా ఉండాలి’ అంటూ శ్రీలీల చెప్పిన డైలాగ్‌ టీజర్‌లో ఉంది. ‘ఎక్స్‌ట్రాఆర్డినరీ మ్యాన్‌’ (2023) చిత్రం తర్వాత హీరో నితిన్, హీరోయిన్‌ శ్రీలీల రెండోసారి జోడీగా నటిస్తున్న చిత్రం ‘రాబిన్‌హుడ్‌’. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు.

‘యునిక్‌ యాక్షన్, ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ‘రాబిన్‌హుడ్‌’ రూపొందుతోంది. ఈ చిత్రంలో నితిన్‌ పాత్రకు శ్రీలీల పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుంది. వారి పాత్రలు రాయడంలో వెంకీ కుడుముల స్పెషల్‌ కేర్‌ తీసుకున్నారు. క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 20న మా సినిమా విడుదల కానుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement