సమ్‌థింగ్ డిఫరెంట్‪‌గా 'స్వాగ్' ట్రైలర్ | Sree Vishnu Swag Movie Trailer Telugu | Sakshi
Sakshi News home page

Swag Trailer: నాలుగు పాత్రలు-నాలుగు టైమ్ లైన్స్‌లో 'స్వాగ్'

Sep 30 2024 10:10 AM | Updated on Sep 30 2024 10:59 AM

Sree Vishnu Swag Movie Trailer Telugu

యంగ్ హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ 'స్వాగ్'. ఇందులో సింగ, భవభూతి, యయాతి, కింగ్ భవభూతి అనే నాలుగు పాత్రల్లో కనిపిస్తాడు. వీటన్నింటికీ డిఫరెంట్ షేడ్స్ ఉండటంతో పాటు డైలాగ్ డెలివరీ కూడా అంతే డిఫరెంట్‌గా ఉంది. 1551లో మొదలైన ఈ కథ ప్రస్తుతం వరకు దాదాపు నాలుగు టైమ్ లైన్స్‌లో ఉండనుంది. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ట్రైలర్‌ని తాజాగా రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్)

పురుషాధిక్యం అనే పాయింట్ ఆధారంగా 'స్వాగ్' సినిమా తీసినట్లు తెలుస్తోంది. చాలావరకు అచ్చ తెలుగు పదాలే వినిపిస్తున్నాయి. అక్టోబరు 4న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. గతంలో శ్రీవిష్ణుతోనే  'రాజరాజచోర' అనే హిట్ మూవీ తీసిన హసిత్ గోలి దీనికి దర్శకుడు.

ఈ సినిమాతో మీరా జాస్మిన్ చాలారోజుల తర్వాత మళ్లీ తెలుగులో నటించింది. రీతూ వర్మ హీరోయిన్. సునీల్, దక్ష నగర్కర్, శరణ్య ప్రదీప్, గెటప్ శ్రీను, రవిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు.

(ఇదీ చదవండి: Bigg Boss8: సోనియాని ఎలిమినేట్ చేసి మంచి పనిచేశారా?)

Advertisement
 
Advertisement
Advertisement