సమంతను అలా చూసి కళ్లు చెమ్మగిల్లాయి : శోభిత | Sobhita Dhulipala Intresting Comment On Her Sister Samatha And Naga Chaitanya | Sakshi
Sakshi News home page

అమ్మ అని పిలిపించుకోవాలని ఉంది : శోభిత

Oct 6 2024 11:37 AM | Updated on Oct 6 2024 11:47 AM

Sobhita Dhulipala Intresting Comment On Her Sister Samatha And Naga Chaitanya

శోభిత ధూళిపాల త్వరలోనే అక్కినేని కోడలు కాబోతుంది. అక్కినేని అందగాడు నాగ చైతన్యతో శోభిత ఎంగేజ్‌మెంట్‌ ఆగస్ట్‌ 8న జరిగింది. ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. గత కొన్నాళ్ల క్రితమే వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చాయి. అయితే అదేం లేదంటూ కొట్టిపారేసిన ఈ జంట.. ఈ ఏడాది ఆగస్ట్‌లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకొని తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టారు. అప్పటి నుంచి శోభిత పేరు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంది. ఆమె ఏం మాట్లాడినా అది న్యూస్‌ అవుతోంది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన చెల్లి సమంత గురించి మాట్లాడింది. అది కాస్త నాగ చైతన్య మాజీ భార్య, హీరోయిన్‌ సమంత గురించే అన్నట్లుగా నెటిజన్స్‌ ట్రోల్‌ చేస్తున్నారు.

సమంత నా సోల్‌మేట్‌
శోభితా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన చెల్లి సమంత అంటే చాలా ఇష్టమని చెప్పింది. ‘నా చెల్లి సమంత నా సోల్‌మేట్‌. ఈ మధ్యే తన పెళ్లి అయింది. అందంగా ముస్తాబై మండపంలో కూర్చున్న నా చెల్లిని చూసినప్పుడు ఆనందంతో కళ్లు చెమ్మ గిల్లాయి. తన పెళ్లి కారణంగానే నేను మా బంధువులనంతా కలుసుకున్నాను. కెరీర్‌లో బీజీగా ఉండడం కారణంగా ఇన్నాళ్లు వారిని దూరమైపోయాను. ఇకపై పర్సనల్‌ లైఫ్‌కి కూడా సమయం కేటాయిస్తాను’ అని శోభితా చెప్పుకొచ్చింది.

చిన్నప్పటి కోరిక అది
అదే ఇంటర్వ్యూలో తన చిన్నప్పటి కోరిక ఏంటో కూడా శోభితా చెప్పింది. ‘నాకు చిన్నప్పటి నుంచి ఓ కోరిక ఉండేది. అదే అమ్మ కావడం. మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదించాలని ఉంది’అని శోభిత చెప్పుకొచ్చింది. ఇక కాబోయే భర్త నాగ చైతన్య గురించి మాట్లాడుతు..  చైతు చాలా మర్యాదస్తుడు. ఎంతో హుందాగా ప్రవర్తిస్తాడు. ఎప్పుడూ ప్రశాంతంగా, కూల్‌గా ఉంటాడు. అతనిలో ఉన్న ఈ లక్షణాలు నాకు చాలా ఇష్టం’అని చెప్పుకొచ్చింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement