లేడీ సింగర్ పెళ్లి.. రూ.191 కోట్ల ఖర్చు.. రూ.248 కోట్ల విరాళం | Singer Taylor Swift Wedding Cost And Husband Details | Sakshi
Sakshi News home page

Taylor Swift: ఫుట్‌బాలర్‌ని పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్

Jul 4 2026 9:11 PM | Updated on Jul 4 2026 9:11 PM

Singer Taylor Swift Wedding Cost And Husband Details

ప్రపంచ ప్రఖ్యాత పాప్ ‍స్టార్ టేలర్ స్విఫ్ట్ పెళ్లి చేసుకుంది. ‍అమెరికన్ ఫుట్‌బాలర్ ట్రావిస్ కెల్సే‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. శుక్రవారం రాత్రి న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో ఒక్కటయ్యారు. టేలర్ స్విఫ్ట్ ప్రతినిధి ట్రి పైన్ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. పెళ్లి తర్వాత మాడిసన్ స్క్వేర్ గార్డెన్ బయటున్న భారీ డిజిటల్ స్క్రీన్‌పై 'JUST&T MARRIED!' అని ప్రదర్శించారు.

(ఇదీ చదవండి: 'నాగబంధం' సినిమా.. ఒక్కరోజులోనే కట్ చేసిపడేశారు)

న్యూయార్క్ నగర అనుమతుల విభాగం ప్రత్యేక కార్యక్రమానికి బుధవారం అధికారిక అనుమతి ఇచ్చింది. గురువారం సాయంత్రం 100 మంది అతిథులతో రిహార్సల్ డిన్నర్ నిర్వహించగా, శుక్రవారం మధ్యాహ్నం నుంచి ప్రధాన వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమాలు శనివారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. అయితే ఈ వేడుకకు రూ.191 కోట్ల మేర ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

ఈ పెళ్లి వేడుకకు హాలీవుడ్, సంగీత, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. హ్యూ గ్రాంట్, ఈథన్ హాక్, బ్రాడ్లీ కూపర్, డకోటా జాన్సన్, బ్రాడ్ పిట్, కింబర్లీ విలియమ్స్-పైస్లీ తదితరులు సందడి చేశారు. అయితే పెళ్లి ఫొటోలు, వీడియోలు బయటకు రాకుండా వేదిక దగ్గర మొబైల్ ఫోన్లపై నిషేధం విధించారు.

ఇకపోతే పెళ్లికి ముందు టేలర్ స్విఫ్ట్, ట్రావిస్ కెల్సే.. దేశవ్యాప్తంగా పలు సేవా సంస్థలకు సుమారు 26 మిలియన్ డాలర్లు(రూ.248 కోట్లు) విరాళంగా అందించినట్లు వారి ప్రతినిధి వెల్లడించారు. ఫుడ్ బ్యాంక్స్, ఆర్ట్స్ కాలేజీలు, చిన్నారుల క్యాన్సర్ చికిత్సా కార్యక్రమాలకు ఈ మొత్తం అందనుంది. డాలీ పార్టన్‌కు చెందిన 'ఇమాజినేషన్ లైబ్రరీ' కూడా రెండు మిలియన్ డాలర్ల విరాళం అందుకోగా, ఆమె సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

(ఇదీ చదవండి: సినిమా సూపర్ హిట్.. కొత్త కారు కొన్న యంగ్ హీరో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement