సింగర్ సునీత తనయుడి కొత్త సినిమా.. ట్రైలర్ రిలీజ్ | Singer Sunitha Son Akash Goparaju Kotha Malupu Movie Trailer out now | Sakshi
Sakshi News home page

సింగర్ సునీత తనయుడి కొత్త సినిమా.. ట్రైలర్ రిలీజ్

Jun 7 2026 9:15 PM | Updated on Jun 7 2026 9:15 PM

Singer Sunitha Son Akash Goparaju Kotha Malupu Movie Trailer out now

ప్రముఖ సింగర్ సునీత తనయుడు ఆకాశ్ గోపరాజు హీరోగా వస్తోన్న చిత్రం కొత్త మలుపు. ఈ మూవీలో భైరవి అర్ధ్యా  హీరోయిన్‌గా నటిస్తోంది. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. తాటి బాలకృష్ణ నిర్మించిన ఈ మూవీ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తధాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించగా.. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఎ. కోదండరామి రెడ్డి మాట్లాడుతూ..'ట్రైలర్ చాలా బాగుంది. సినిమా కాన్సెప్ట్ కూడా నచ్చింది. హీరో, హీరోయిన్ ఇద్దరూ ఆకట్టుకున్నారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పెద్ద విజయంగా నిలబెట్టాలని కోరుకుంటున్నాను” అన్నారు.

ట్రైలర్ చూస్తుంటే గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ రొమాంటిక్ ప్రేమకథలో ప్రేమ, సస్పెన్స్, వినోదం ఉండేలా కనిపిస్తోంది. ఇందులో ఆకాష్, భైరవి బావ, మరదళ్ల పాత్రల్లో కనిపించనున్నారు. కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా భావోద్వేగాలు, ఉత్కంఠ, హాస్యం, కుటుంబ ప్రేక్షకులను అలరించేలా ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రంలో రఘుబాబు, పృథ్వీరాజ్, ప్రభావతి కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి యశ్వంత్ నాగ్  సంగీతం అందించారు.

దర్శకుడు శివ వరప్రసాద్ మాట్లాడుతూ..' మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన దర్శక దిగ్గజం కోదండరామి రెడ్డికి హృదయ పూర్వక ధన్యవాదములు. రొమాంటిక్ లవ్ సస్పెన్స్ జానర్‌లో ఈ సినిమాను రూపొందించాం. ఆకాష్–భైరవి జోడీ చాలా బాగా కుదిరింది. కోనసీమ అందాలను తెరపై ఆవిష్కరిస్తూ, మంచి కామెడీతో కూడిన కథను ప్రేక్షకులకు అందిస్తున్నాం. జూన్ 12న సినిమా విడుదల కానుంది” అని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement