Bhairavi
-
కొత్త మలుపు మూవీతో టాలీవుడ్ కి పరిచయం అవుతున్న భైరవి (ఫొటోలు)
-
ఓటీటీ అయినా ఓకే.. అదే నా లక్ష్యం : భైరవి
‘‘కొత్త మలుపు’లో కుటుంబ భావోద్వేగాలు, వినోదం, కామెడీ, సస్పెన్స్ వంటి అన్ని వాణిజ్య అంశాలున్నాయి. యువతరానికే కాదు... కుటుంబ ప్రేక్షకులకూ మా చిత్రం నచ్చుతుంది’’ అని భైరవి ఆర్థ్యా అన్నారు. గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా నటించిన చిత్రం ‘కొత్త మలుపు’. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో తాటి బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమాని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ నేడు(జూన్12) విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం హీరోయిన్ భైరవి ఆర్థ్యా విలేకరులతో మాట్లాడుతూ– ‘‘కొత్త మలుపు’లో నా పాత్ర పేరు వరలక్ష్మి. కోనసీమకు చెందిన అమాయకమైన గ్రామీణ యువతి తను. చాలా స్వేచ్ఛగా, మనసుకు నచ్చినట్టు జీవించే అమ్మాయి. ఈ సినిమా కోసం నాకు భాషే పెద్ద సవాలుగా మారింది. తెలుగు నేర్చుకున్నప్పటికీ గోదావరి ప్రాంత యాసను పట్టుకోవడం అంత సులభం కాదు. అలాగే వర్షాకాలంలో షూటింగ్ జరగడంతో వాతావరణ పరిస్థితులు కూడా కొంత ఇబ్బంది కలిగించాయి. అయితే టీమ్ అందరి సహకారంతో ఆ సవాళ్లను అధిగమించగలిగాను.ఇక మంచి కథ, పాత్ర బాగుంటే సినిమా అయినా, ఓటీటీ ప్రాజెక్ట్ అయినా నటించేందుకు నేను సిద్ధమే,నా తల్లిదండ్రులు గర్వపడేలా చేయడం నా లక్ష్య’అని పేర్కొన్నారు. -
సింగర్ సునీత తనయుడి కొత్త సినిమా.. ట్రైలర్ రిలీజ్
ప్రముఖ సింగర్ సునీత తనయుడు ఆకాశ్ గోపరాజు హీరోగా వస్తోన్న చిత్రం కొత్త మలుపు. ఈ మూవీలో భైరవి అర్ధ్యా హీరోయిన్గా నటిస్తోంది. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. తాటి బాలకృష్ణ నిర్మించిన ఈ మూవీ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తధాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించగా.. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు.ఈ సందర్భంగా ఎ. కోదండరామి రెడ్డి మాట్లాడుతూ..'ట్రైలర్ చాలా బాగుంది. సినిమా కాన్సెప్ట్ కూడా నచ్చింది. హీరో, హీరోయిన్ ఇద్దరూ ఆకట్టుకున్నారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పెద్ద విజయంగా నిలబెట్టాలని కోరుకుంటున్నాను” అన్నారు.ట్రైలర్ చూస్తుంటే గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ రొమాంటిక్ ప్రేమకథలో ప్రేమ, సస్పెన్స్, వినోదం ఉండేలా కనిపిస్తోంది. ఇందులో ఆకాష్, భైరవి బావ, మరదళ్ల పాత్రల్లో కనిపించనున్నారు. కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా భావోద్వేగాలు, ఉత్కంఠ, హాస్యం, కుటుంబ ప్రేక్షకులను అలరించేలా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రంలో రఘుబాబు, పృథ్వీరాజ్, ప్రభావతి కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి యశ్వంత్ నాగ్ సంగీతం అందించారు.దర్శకుడు శివ వరప్రసాద్ మాట్లాడుతూ..' మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన దర్శక దిగ్గజం కోదండరామి రెడ్డికి హృదయ పూర్వక ధన్యవాదములు. రొమాంటిక్ లవ్ సస్పెన్స్ జానర్లో ఈ సినిమాను రూపొందించాం. ఆకాష్–భైరవి జోడీ చాలా బాగా కుదిరింది. కోనసీమ అందాలను తెరపై ఆవిష్కరిస్తూ, మంచి కామెడీతో కూడిన కథను ప్రేక్షకులకు అందిస్తున్నాం. జూన్ 12న సినిమా విడుదల కానుంది” అని తెలిపారు. -
క్యూట్‌నెస్‌తో కట్టిపడేసిన భైరవి.. ఎవరీ బ్యూటీ?
-
తెలుగు తెరపై మరో కొత్త హీరోయిన్
టాలీవుడ్ స్క్రీన్ కు ఓ కొత్త గ్లామర్ యాడ్ కాబోతుంది. అందం, అభినయం కలగలిసిన భైరవి (Bhairavi) తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది. 'సర్కార్ నౌకరి' ఫేమ్, ప్రముఖ సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా తధాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై చేస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 మూవీలో హీరోయిన్గా భైరవి నటించింది. ఇది ఆమెకు డెబ్యూ మూవీ. సెంటిమెంట్, ఎమోషనల్ వంటి సీన్లలో భైరవి యాక్టింగ్ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతున్నట్టు చిత్ర యూనిట్ చెబుతోంది. సినిమా విడుదల తర్వాత భైరవిని తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోవడం ఖాయమని చెబుతున్నారు.శివ దర్శకత్వంలో, తాటి బాలకృష్ణ నిర్మాణంలో సీనియర్ నటీనటులు రఘుబాబు, పృద్వి, ప్రభావతి తదితరులు నటించారు.ఈ సందర్భంగా నిర్మాత తాటి బాలకృష్ణ మాట్లాడుతూ... ''ఈ మూవీ విలేజ్ బ్యాక్ గ్రౌండ్లో రూపొందిస్తున్నాం. రొమాంటిక్ లవ్ సస్పెన్స్ కామెడీ చిత్రం. సర్కార్ నౌకరి ఫేమ్ ఆకాష్ హీరోగా నటించే ఈ సినిమా కోసం హీరోయిన్ గా భైరవి తెలుగు తెరకు తొలి పరిచయం చేస్తున్నాం. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో భైరవి సరిగ్గా సరిపోతుంది. హీరోకి మరదలు పాత్ర చేస్తుంది. ఆమె పాత్ర సినిమాలో హైలైట్ గా ఉండబోతోంది. ఈ సినిమా ప్రతి ఒక్కరిని అలరిస్తుందని ఖచ్చితంగా చెప్పగలము. ప్రస్తుతం మా మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నది. త్వరలోనే సినిమా టైటిల్, విడుదల తేదీ ప్రకటిస్తాం.'' అని అన్నారు. -
Highway to Swades: మనలోనే సూపర్శక్తి
భారతదేశంలో అత్యంత శక్తిమంతమైన మహిళల్లో ఒకరుగా పేరొందారు భైరవి జానీ. లాజిస్టిక్ సప్లై చైన్ వ్యవస్థాపకురాలైన భైరవి జానీ దేశం అంతటా పద్ధెనిమిది వేల కిలోమీటర్లకు పైగ పర్యటించి, తన అనుభవాలతోపాటు, ఎంతోమంది అభిప్రాయాలను పొందుపరిచి, ‘హైవే టు స్వదేశ్’ పేరుతో పుస్తకంగా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన భైరవి జానీ మనదేశంలోనే సూపర్ శక్తి ఉందంటూ తన పర్యటన విశేషాలను, అనుభవాలను పంచుకున్నారు. ‘‘భారతదేశపు నాగరికతపై దృష్టి సారించినప్పుడు మనవారిలో ఉన్న సూపర్ పవర్స్ ఏంటో అర్దమైంది. నాగాలాండ్‌లోని మారుమూల ప్రాంతాల నుంచి రాన్ అఫ్ కచ్ వరకు, దక్కన్ పీఠభూమిలోని వివిధ ప్రాంతాలన్నీ 51 రోజుల పాటు 18,181 కిలోమీటర్లు ప్రయాణించాను. వీటితోపాటు రెండు దశాబ్దాల కాలంలో దేశవ్యాప్తంగా చేసిన వివిధ ప్రయాణాలలో పరిశీలనల విశ్లేషణ కూడా ఇందుకు దోహదపడింది. ► స్వయంగా తెలుసుకుని... 2014లో ఒక రోజు రోడ్ ట్రిప్‌లో ఉన్నప్పుడు దేశ ఆర్థికాభివృద్దిపై సమగ్ర పుస్తకం తీసుకురావాలనే ఆలోచన వచ్చింది. అప్పటి నుంచే నా వ్యాపార పనులతో పాటు రోడ్ ట్రిప్స్ కూడా ప్లాన్ చేసుకునేదాన్ని. అన్ని చోట్లా ప్రజల జీవన స్థితిగతులను స్వయంగా అడిగి తెలుసుకున్నాను. చాలా భిన్నమైన పరిస్థితులు, అతి సాధారణ విషయాలు కూడా స్వయంగా చూసి తెలుసుకున్నాను. అలాగే, పెద్ద యెత్తున వ్యాపారాలు చేస్తున్న వారినీ కలిశాను. హిమాలయాల్లో ఉన్న భిన్న కమ్యూనిటీ ప్రజలను కలుసుకున్నాను. వారి సామాజిక, ఆర్థిక, అభివృద్ధి స్థితిగతులన్నింటిపైన ఒక అవగాహన తెచ్చుకున్నాను. కోవిడ్ లాక్డౌన్ టైమ్‌లో ఈ పుస్తకం రాయడం ప్రారంభించాను. హైదరాబాద్ విషయాలనూ ఇందులో పొందుపరిచాను. ఇక్కడి వంటకాలు, దుస్తులు, భాష,. సాహిత్యం, కళలు, ఆర్కిటెక్చర్, పండగలు, వ్యాపారం.. ప్రతిదీ సమ్మేళన సంస్కృతిగా ఉంటుంది. పాత నగరం నుంచి ఇప్పుడు ఆధునిక మహానగరంగా టెక్నాలజీ హబ్‌గా మారింది. ఇదంతా ప్రజల విజ్ఞానశక్తి, వ్యాపార శక్తిని సూచిస్తుంది. ‘హైవే టు స్వదేశ్’ అనేది భారతదేశంలోని పన్నెండు సూపర్ పవర్లకు అద్భుతమైన ప్రతిబింబం అని చెప్పవచ్చు. ► సమయపాలన చాలా మంది ‘మీరు 20 వేర్వేరు కంపెనీలలో బోర్డు మెంబర్‌గా ఉండి, ట్రావెలర్‌గా, రచయితగా సమయాన్ని ఎలా సర్దుబాటు చేసుకుంటున్నారు’ అని అడుగుతుంటారు. ఏదైనా పని ప్రారంభించాలనుకున్నప్పుడు, ఆ పని పూర్తిచేయనిదే నాకు నిద్ర పట్టదు. నేను తిరిగిన నేల, అక్కడి ప్రజల అనుభవాలను తెలుసుకుంటున్నప్పుడు జరిగింది అదే. టైమ్ విషయంలో చాలా కచ్చితమైన నిర్ణయం ఉంటుంది. రాజు అయినా కూలీ అయినా మనకు ఉండేది 24 గంటలు మాత్రమే. అందుకనే సమయాన్ని పనులవారీగా విభజించుకొని, ప్లాన్ చేసుకుంటాను. ముందుగా ఏ పని ముఖ్యమో దానిపైనే దృష్టి పెడతాను. ప్రతి విషయంలో ముందే ప్లానింగ్‌తో ఉంటాను. అనుకున్న సమయానికల్లా పనులు పూర్తి చేస్తాను. కుటుంబం, వ్యాపారం, రచనలు .. ఇలా టైమ్‌ని విభజించుకుంటాను. ► రోడ్ ట్రిప్స్.. మన దేశం చాలా అందమైనది. ఎంతో విజ్ఞానం ఇక్కడ ప్రజల మధ్య, సంస్కృతుల్లో భాగంగా ఉంది. ప్రతిచోటా ఆసక్తికరమైన కథనాలెన్నో. ఈ దేశంలో అపారమైన అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం, కంపెనీ, ఏదో ఒకదానిపైన ఆధారపడకుండా ప్రజలు తమ మధ్య ఉన్న సూపర్ పవర్స్‌పై నమ్మకంతో ముందడుగు వేయాలి. మనకి మనమే ఒక అద్భుతమైనవారిగా విశ్వసిస్తే ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చు. రోడ్డు ట్రిప్స్‌లో పాల్గొనాలి. జనంతో మాట్లాడాలి. దేశం అభివృద్ధికి సంబంధించి లోతైన విశ్లేషణ చేసి, అందులో మనకున్న కలల సాధనకు కృషి చేయాలి’ అని వివరించారు భైరవి జానీ. 1896లో స్థాపించిన ఎస్.సి.ఏ. గ్రూప్ ఆఫ్ కంపెనీలకు దశాబ్ద కాలం నుంచి చైర్‌పర్సన్‌గా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సేవలందిస్తోంది భైరవి. ఈ క్రమంలో అనేక వెంచర్లను ప్రారంభించడంతో పాటు వాటిని అభివృద్ధి చేస్తూ వచ్చారు. ముంబై వాసి అయిన భైరవి జానీ యుఎస్ఎలో చదివి, అక్కడే వ్యాపారలావాదేవీలు కొనసాగించి 2001లో తన స్వంత వెంచర్‌ను ప్రారంభించేందుకు భారతదేశానికి తిరిగి వచ్చారు. దేశ, విదేశాల్లో బిజినెస్ ఉమన్‌గా తన సత్తా చాటుతున్నారు. శిక్షణ పొందిన శాస్త్రీయ నృత్యకారిణిగానూ ఆమెకు పేరుంది. హిమాలయాల్లో ఉన్న వివిధ కమ్యూనిటీ ప్రజలకు స్థిరమైన జీవనోపాధిని సృష్టించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. – నిర్మలారెడ్డి -
మూవీ బజ్: బాలీవుడ్ బరి.. విశ్వాస్ గురి
బాలీవుడ్ బరి.. విశ్వాస్ గురి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, వివాదాస్పద వికటకవి కుమార్ విశ్వాస్ బాలీవుడ్లో రంగప్రవేశం చేశారు. త్వరలో విడుదల కానున్న ‘భైరవి’ చిత్రానికి ఆయన పాట రాశారు. వెటరన్ గాయని ఆశాభోంస్లే ఈ పాట పాడనున్నారు. తాను రాసిన పాటను ఆమె పాడటం వల్ల తన కల నెరవేరిందంటున్నాడు విశ్వాస్. విజయనారి.. సాండ్రా సరి ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీతో మల్టీబిలియన్ కంపెనీ స్థాపించే స్థాయికి ఎదిగిన మార్కెటర్ బ్రౌనీ వైస్ జీవితకథ ఆధారంగా తెరకెక్కనున్న ‘టప్పర్‌వేర్ అన్సీల్డ్’లో సాండ్రా బుల్లక్ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు సమాచారం. బ్రౌనీ జీవిత కథను రాసిన బాబ్ కీలింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. పొడగరి.. సొగసరి ‘బాలీవుడ్లో అత్యంత పొడగరి హీరోయిన్ ఎవరు?’... ఎ) హుమా ఖురేషీ, బి) కత్రినా కైఫ్, సి) దీపికా పడుకొనే, డి) ప్రీతీజింటా. ఇదేమీ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో ప్రశ్న కాదు. కేరళ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇటీవల నిర్వహించిన పోటీపరీక్షలోనిది. పరీక్షలో ఇలాంటి ప్రశ్న అడగటంతో ‘ట్విట్టర్’లో రచ్చ మొదలైంది. సమాధానం దీపిక పడుకొనే!


